Share News

టీడీపీతోనే సంక్షేమం..అభివృద్ధి

ABN , Publish Date - Jan 17 , 2024 | 09:59 PM

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అ న్నా రు. మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో బుధవారం బాబు ష్యూరిటీ.. భ విష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఎరిక్షన్‌బాబు ఇంటింటికీ తిరిగి ప్రజలకు టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. గతంలో చంద్రబాబు పాలనలో చేసిన అభివృద్ధి, పథకాల లబ్ధిని చెప్తూనే ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి నాశనం అవడంతోపాటు ప్రజలు కష్టాలకోరల్లో చిక్కుకున్నారని తెలిపారు. పేదలకు మేలు చేసే అన్ని పథకాలను జగన్‌రెడ్డి రద్దు చేశారన్నారు.

టీడీపీతోనే సంక్షేమం..అభివృద్ధి
వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిని ఆహ్వానిస్తున్న ఎరిక్షన్‌బాబు

నల్లగుంట్లలో ఇంటింటి ప్రచారంలో ఎరిక్షన్‌బాబు

పెద్ద దోర్నాల, జనవరి 17 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అ న్నా రు. మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో బుధవారం బాబు ష్యూరిటీ.. భ విష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఎరిక్షన్‌బాబు ఇంటింటికీ తిరిగి ప్రజలకు టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. గతంలో చంద్రబాబు పాలనలో చేసిన అభివృద్ధి, పథకాల లబ్ధిని చెప్తూనే ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి నాశనం అవడంతోపాటు ప్రజలు కష్టాలకోరల్లో చిక్కుకున్నారని తెలిపారు. పేదలకు మేలు చేసే అన్ని పథకాలను జగన్‌రెడ్డి రద్దు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని, ప్రజలంతా సంతోషాలతో ఉండేలా చూడాలని కోరారు. ప్రధానంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఏడాదికి 3గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆడబి డ్డ ఉన్న ప్రతి కుటుంబంలో రూ.1500 ఇవ్వనున్నట్లు చెప్పారు. పేద మహిళలను ఆర్థికంగా బలవంతులను చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. రై తులకు ఏడాదికి పెట్టుబడి సాయంగా రూ.20వేలు, నిరుదోగులకునెలకు రూ.3వేలు, ఇంటింటికీ కుళాయి, ఏటా ఉద్యోగావకాశాల కల్పనతో అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకాలను అమలు చేయనున్నారని తెలిపారు.

టీడీపీలోకి వైసీపీ మాజీ సర్పంచ్‌

ఎరిక్షన్‌బాబు క్లస్టర్‌ స్థాయిలో గ్రామ, భూత్‌ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ మాజీ స ర్పంచ్‌ రామాంజనేయులు, పలువురు కార్యకర్తలు బుధవారం టీడీపీలో చే రారు. వైసీపీ పాలనలో ఐదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించక పోవడంతో మనస్థాపం చెంది టీడీపీలో చేరుతున్న ట్లు రామాంజనేయులు తెలిపారు. కార్యక్రమం లో నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, దేసు నాగేంద్రబాబు, ఎలకపాటి చంచయ్య, చల్లా వెంకటేశ్వర్లు,షేక్‌ బాషా, ఇస్మాయిల్‌, బట్టు సుధాకర్‌ రెడ్డి, ఆర్‌ సుబ్బరత్నం,శేఖర్‌, రామకృష్ణయ్య, మౌలాలి పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 09:59 PM