Share News

టీడీపీతోనే మహిళల సంక్షేమం

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:04 AM

టీడీపీలోనే మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

టీడీపీతోనే మహిళల సంక్షేమం

పెద్దదోర్నాల, ఫిబ్రవరి 1: టీడీపీలోనే మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని ఎగువ చెర్లోపల్లి గ్రామంలో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులను కలిసి వైసీపీ ప్రభుత్వంలో ఎంతగా ఇబ్బందులు పడ్డామో తెలియజేస్తూనే టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. దివంగత ఎన్‌టీఆర్‌ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారన్నారను. ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటు అందించారన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్‌ సిలెండర్లు, అందించారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఒక్కొక్కరికి నెలనెలా రూ.1500లు, ఏటా మరో రూ.15,000లు అందజేస్తారన్నారు. ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తారన్నారు. ఆ మేరకు టీడీపీ అమలుచేసే సంక్షేమ పథకాల బాండ్లను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, ఎలకపాటి చెంచయ్య, చల్లా వెంకటేశ్వర్లు, షేక్‌ బాష, ఇస్మాయిల్‌, సీనియర్‌ నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, షేక్‌ మంజూర్‌ భాష, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

ఎర్రగొండపాలెం(పుల్లలచెరువు) : వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలనిఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు కోరారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బాబుష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రణాళికలపై బూత్‌ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌ కన్వీనర్లు ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామం చూసినా, సీసీ రోడ్డు, డ్రేనేజీలు లేక గ్రామాల్లో మురుగురోడ్లపైకి వస్తోందన్నారు. నియోజవర్గంలో వైసీపీ నాయకులు అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు అమలుజేసే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా.. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఎక్కడ రోడ్డులు లేవని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య, మాజీ ఎంపీపీ మంత్రునాయక్‌, చేవుల అంజయ్య, చిట్యాల వెంగళరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలో పలు కుటుంబాల చేరిక

కంభం : పట్టణంలో సంగవీధిలోని పలు కాపు కుటుంబాలు స్థానిక టీడీపీ నాయకులు గుడిమెట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. అశోక్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కాపులకు కల్పించిన 5శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసిన కాపు ద్రోహిగా జగన్‌రెడ్డి మిగిలారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగినబుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తన గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌.చిన్నమస్తాన్‌రావు, కొండా వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, డి.శ్రీనివాసులు, ఎం.ప్రసాద్‌, ఎస్‌.శ్రీనివాసులు, వార్డు సభ్యులు కంటా రంగలక్ష్మి, రిటైర్డ్‌ ఎస్సై కొండయ్య, డి.భరత్‌కుమార్‌, కటారి ప్రసాద్‌, యగటీల ప్రసాద్‌, యగటీల రంగ, రంగస్వామి, రఘు, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, రఘు, టీడీపీ మండల అధ్యక్షులు తోట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి మల్లికార్జున, పట్టణ అధ్యక్షులు ఓబులరెడ్డి మాధవ, కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు పొలిటికల్‌ కన్వీనర్‌ డి.బాలీశ్వరయ్య, పార్లమెంటు నాయకులు కేతం శ్రీనివాసులు, సయ్యద్‌ అనీస్‌, మైనారిటీ నాయకులు దాదా, ఎస్సీసెల్‌ అధ్యక్షులు గోన చెన్నకేశవులు, రైతు అధ్యక్షులు తోట శ్రీను, జనసేన మండల అధ్యక్షులు టి.ప్రసాద్‌, పార్లమెంటు కార్యదర్శి లంకా నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 01:04 AM