Share News

ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం

ABN , Publish Date - May 08 , 2024 | 01:57 AM

ముస్లింల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ.షరీఫ్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 4వ డివిజన్‌లో ముస్లింలతో టీడీపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్‌, మాగుంట ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
ఒంగోలులో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న షరీఫ్‌, వేదికపై మాగుంట, జనార్దన్‌

శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌

ముస్లింలతో దామచర్ల, మాగుంట ఆత్మీయ సమావేశం

ఒంగోలు(కార్పొరేషన్‌), మే7: ముస్లింల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ.షరీఫ్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 4వ డివిజన్‌లో ముస్లింలతో టీడీపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్‌, మాగుంట ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన షరీఫ్‌ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు రాజకీయంగా పెద్దపీట వేశారన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే 2014లో అమలుచేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలిపారు. ఒంగోలు ఎంపీ, టీడీపీ కూటమి పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివా సులరెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడిన ముస్లింలు రాబోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి,చంద్రబాబును మళ్లీ ముఖ్య మంత్రిని చేయాలని కోరారు. ఈనెల13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయా లన్నారు. విలువైన ఓటును సైకిల్‌ గుర్తుకు వేసి, ఎమ్మె ల్యేగా దామచర్ల జనార్దన్‌ను, ఎంపీగా తనను గెలిపించా లని కోరారు. దామచర్ల మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లింల సమస్యల పరిష్కారానికి టీడీపీ అత్యధిక నిధులు కేటాయించిందని తెలిపారు. షాదీఖానా నిర్మాణం, ఖబరస్థాన్‌లు, ఈద్గాల అభివృద్ధితోపాటు దుల్హన్‌ పథకం, హజ్‌ యాత్రలకు నిధులు కేటాయించి ముస్లిం సంక్షేమా నికి పెద్దపీట వేసింది టీడీపీనేనన్నారు. రంజాన్‌ తోఫాతో పాటు మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా అనేక నిధులు కేటా యించి, వృత్తి నైపుణ్యాలను పెంచిందన్నారు. ఉపాధి మార్గాలకు ఆసరాగా నిలిచిన ఘనత టీడీపీదే అన్నారు. మైనార్టీలకు చెందిన ఎండీ షరీఫ్‌ను మండలి చైర్మన్‌గా, లాల్‌జాన్‌ బాషాను ఎంపీగా చేయడంతోపాటు పలువురికి రాజకీయంగా అనేక పదవులు కేటాయించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముస్లింలు నివసించే ప్రాంతాలలో రోడ్లు వేయించడంతోపాటు తాగునీటి సమస్యను పరిష్కరించానని గుర్తుచేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, బీజేపీ నాయకులు యోగయ్యయాదవ్‌, షేక్‌ కపిల్‌బాషా, పఠాన్‌ హనీఫ్‌ఖాన్‌, అన్వర్‌, సిలార్‌, 4వ డివిజన్‌ కార్పొరేటర్‌ నూర్జహాన్‌, అన్వర్‌ బాబు పాల్గొన్నారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జనార్దన్‌ను ఎమ్మెల్యేగా, మాగుంటను ఎంపీగా గెలిపించుకుంటామని తెలిపారు. స్థానికులు టీడీపీ కూటమి అభ్యర్థులను ఘనంగా ఆహ్వానించారు.

Updated Date - May 08 , 2024 | 01:57 AM