Share News

సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:31 PM

గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొ ట్టుమిట్టాడుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అ నేక సంక్షేమ ఫలాలను అందించి కేవలం వంద రోజులలోనే మంచి పేరు తెచ్చుకుం దన్నారు. కూటమి పాలన వందరోజులు పూర్తయిన సందర్భంగా శనివారం మండ ల పరిధిలోని వెదుళ్ళచెరువు పంచాయతీ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ని ర్వహించారు.

సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు
వెలిగండ్ల: మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

వెలిగండ్ల మండల అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

వెలిగండ్ల, సెప్టెంబరు 21: గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొ ట్టుమిట్టాడుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అ నేక సంక్షేమ ఫలాలను అందించి కేవలం వంద రోజులలోనే మంచి పేరు తెచ్చుకుం దన్నారు. కూటమి పాలన వందరోజులు పూర్తయిన సందర్భంగా శనివారం మండ ల పరిధిలోని వెదుళ్ళచెరువు పంచాయతీ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ని ర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రా లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మా ట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఉ పాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ ప్రకటన, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు ప్రా రంభించినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత పా రదర్శక పాలన అందించి ప్రజా మన్ననలు పొందుతామ న్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభు త్వంలోనే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి, దొడ్డా వెంకటసు బ్బారెడ్డి, శ్యామల కాశిరెడ్డి, కేలం ఇంద్ర భూపాల్‌ రెడ్డి, గోనా ప్రతాప్‌, గవదకట్ల హరికృష్ట, చిలకల వెంకటేశ్వర రెడి, కొండు బాస్కర్‌రెడ్డి, గురుస్వామి, బొబ్బా రమణా రెడ్డి, బీరం బెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్‌ పెరుగు తిరప తమ్మ, జయపాల్‌ రెడ్డి, కె.భాస్కర్‌ రెడ్డి, అంకయ్య, మీనిగ కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి

పామూరు, సెప్టెంబరు 21: సంక్షోభంలోనూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథ కాలు అందిస్తూ అభివృద్ధికి రెక్కలు తొడిగిందని టీ డీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దనరావు అన్నారు. మొదటి వందరోజుల్లోనే ప్రజల చేత ప్రశంసలు అందుకుంటుం దని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్నిప్రజలు ఆద రించి ఆశీర్వదించాలన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలో సాధించిన విజయాల పట్ల ప్రజలకు అవగా హన కల్పిస్తూ శనివారం ఇది మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టణంలోని దేవా లయం వీధిలో నిర్వహించారు. ఇంటింకి తిరుగు తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరప త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు యారవ శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు, షేక్‌ ఖాజార హంతుల్లా, స య్యద్‌ అమీర్‌బాబు, ఆర్‌ఆర్‌ రఫి, ఇర్రి కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలం లోని బొట్లగూడూరు, కొండారెడ్డిపల్లి, నర్రమారెళ్ల, రావి గుంటపల్లి, పామూరులోని పలుచోట్ల వందరోజుల పా లనపై టీడీపీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కాగా,: పామూరు సీఐ బీమానాయక్‌ను కోటపాటి జ నార్దనరావు టీడీపీ శ్రేణులతో మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈసందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధి దిశగా కనిగిరి

కనిగిరి, సెప్టెంబరు 21: కూటమి ప్రభుత్వంలో కనిగిరి ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తుందని టీడీపీ మండల కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని తక్కెళ్ళపాడు పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు.

పాలనా దక్షత కల్గిన సీఎం చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నియోజకవర్గ అభివృద్ధికి శ్రమి స్తున్నారన్నారు. కార్యక్రమంలో మల్లెల పిచ్చయ్య, ప్రసా ద్‌, ఏసురత్నం, నాగభూషణం, రావూరి రమణయ్య, వి క్టర్‌, తదితరులు పాల్గొన్నారు.

అలాగే, కనిగిరి నగరపంచాయతీ పరిధిలోని వివిధ వార్డుల్లో , మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ని ర్వహించారు.

Updated Date - Sep 21 , 2024 | 11:31 PM