Share News

సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

ABN , Publish Date - Jan 06 , 2024 | 10:42 PM

సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మండలంలోని చక్రాయపాలెం, శాంతినగర్‌లో శనివారం రాత్రి బాబు స్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి టీడీపీ మినీమేనిఫెస్టో గురించి వివరించారు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా అన్నివర్గాల ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ లభిస్తుందన్నారు.

సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం
6ఎడికె2-మహిళలకు టీడీపీ మినీ మేనిఫెస్టో పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

- ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, జనవరి 6: సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మండలంలోని చక్రాయపాలెం, శాంతినగర్‌లో శనివారం రాత్రి బాబు స్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి టీడీపీ మినీమేనిఫెస్టో గురించి వివరించారు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా అన్నివర్గాల ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ లభిస్తుందన్నారు. సీఎం జగన్‌రెడ్డి పాదయాత్రలో 730 హామీలు ఇచ్చారని ఎమ్మెల్యే రవికుమార్‌ పేర్కొన్నారు. వీటిల్లో 109 హామీలు మాత్రమే అమలు చేసి 85 శాతం హామీలు ఎగ్గొట్టారన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. నాలుగేళ్ళలో పేదల రక్తం పీల్చి దాదాపు రూ.2 లక్షల కోట్లు వివిధ రూపాలలో వసూలు చేశారన్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. పింఛన్‌ రూ.3వేలు చేస్తానని చెప్పి, చివరి మూడు నెలల్లో రూ.3 వేలు ఇవ్వటం మోసం చేయటం కాదా అని ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రశ్నించారు. జగన్‌రెడ్డిని నమ్మి నష్టపోయిన ఫింఛన్‌దారులకు నష్టపోయిన సొమ్ము మొత్తం తిరిగి ఇవ్వాలన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నాగినేని రామకృష్ణ, కరి పరమేష్‌, మానం మురళీమోహన్‌దాస్‌, పెంట్యాల రామాంజనేయులు, బండారు రాఘవ, పూనాటి విక్రమ్‌, గాలం వెంకటేశ్వర్లు, రాయుడు నరేంద్ర, గోగులమూడి రాజశేఖర్‌, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 10:42 PM