Share News

సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:38 PM

సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చూస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే సత్తా చంద్రబాబుకే సాధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని రామభద్రాపురం, దోసకాయలపాడు, తోటవెంగన్నపాలెం, లక్కవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో నాశనమైందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండి, యువత ఉద్యోగావకాశలు లేక కష్టాలు పడుతున్నారు.

సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం
రామభద్రాపురంలో ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, ఎంపీపీ తాటికొండ శ్రీను

టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

తాళ్లూరు, ఏప్రిల్‌ 27: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చూస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే సత్తా చంద్రబాబుకే సాధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని రామభద్రాపురం, దోసకాయలపాడు, తోటవెంగన్నపాలెం, లక్కవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో నాశనమైందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండి, యువత ఉద్యోగావకాశలు లేక కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు రైతుల పక్షపాతిగా, మహిళా పక్షపాతిగా, పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం కాగానే సూపర్‌ సిక్స్‌ పథకాల కింద యువతకు 20లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. .రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఎవరు కృషి చేస్తున్నారో ప్రజలు ఆలోచించి నవ్యాంధ్ర సృష్టి కర్త చంద్రబాబును సీఎంగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరుగనున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని, దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే తనను అధిక మెజారిటీతో గిలిపించాలని గొట్టిపాటి లక్ష్మి కోరారు.

ఆయాగ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, షేక్‌ హుస్సేన్‌, నల్లపాటి సత్యనారాయణ, బొడ్డు హనుమారెడ్డి , షేక్‌ అన్వర్‌, షేక్‌ చినమౌలాలి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, శాగం కొండారెడ్డి, మానం రమేష్‌బాబు, వల్లభనేని సుబ్బయ్య, షేక్‌ కాలేషావలి, వేణుబాబు, తదితరులు పాల్గొన్నారు.

20 కుటుంబాలు టీడీపీలో చేరిక

దర్శి ఏప్రిల్‌ 27: మండలంలోని కట్టుబడివారిపాలెంకు చెందిన షేక్‌ బాషా, చిట్టుబాబు ఆధ్వర్యంలో 20 కుటుంబాలు శనివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ కూటమి పట్ల ప్రజల్లో రోజురోజుకు అభిమానం, నమ్మకం పెరుగుతుందన్నారు. చంద్రబాబు సారథ్యంలోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో టీడీపీలోకి భారీగా చేరుతున్నారని చెప్పారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:38 PM