వెల్‌డన్ ఎరిక్షన్
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:13 PM
‘ఎర్రగొండపాలెంలో మన గెలుపు ఖాయం. మీ పనితీరు బాగుంది. అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారు. ఏమాత్రం అలసత్వం వహించకుండా ముందుకు సాగండి’ అని అక్కడి టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబుకు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. అదేసమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మన్నె రవీంద్రకు కూడా ఆయన ఫోన్ చేశారు. అలకలు, అసంతృప్తులు మాని పార్టీ అభ్యర్థి గెలుపునకు మీ వంతు కృషి చేయండి అని సూచించారు.
ఫోన్‌లో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు
అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని డాక్టర్ రవీంద్రకు సూచన
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
‘ఎర్రగొండపాలెంలో మన గెలుపు ఖాయం. మీ పనితీరు బాగుంది. అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారు. ఏమాత్రం అలసత్వం వహించకుండా ముందుకు సాగండి’ అని అక్కడి టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబుకు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. అదేసమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మన్నె రవీంద్రకు కూడా ఆయన ఫోన్ చేశారు. అలకలు, అసంతృప్తులు మాని పార్టీ అభ్యర్థి గెలుపునకు మీ వంతు కృషి చేయండి అని సూచించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి చంద్రబాబు రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు, నాయకులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అందులో భాగంగా ఎరిక్షన్‌బాబుకు ఫోన్ చేశారు. ‘మిమ్మల్ని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాక పరిస్థితిని కూడా పరిశీలించాం. పూర్తి అనుకూలంగా ఉంది. అక్కడ మనం గెలుస్తున్నాం. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవడంలో సఫలీకృతులవుతున్నారు. ఇదే పంథాలో ముందుకు సాగండి’ అని చెప్పారు. ఒకట్రెండు అంశాలపై ఎరిక్షన్‌బాబు వివరణ ఇచ్చారు. ఆ వెంటనే డాక్టర్ రవీంద్రకు కూడా చంద్రబాబు ఫోన్ చేశారు. ఎరిక్షన్‌బాబు పట్ల రవీంద్ర అసంతృప్తిగా ఉన్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో చంద్రబాబు ఫోన్‌లోనే ‘అలకలు, అసంతృప్తులకు ఇది సమయం కాదు. పార్టీ గెలుపునకు మీ వంతు కృషి చేయండి. తగిన ప్రాధాన్యత ఇస్తాం. ఏదైనా పొరపాటు జరిగితే ఉపేక్షించేది లేదు’ అని హెచ్చరించినట్లు తెలిసింది.