Share News

మాగుంటకు మార్కాపురంలో ఘనస్వాగతం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:46 AM

ఒంగోలు ఎంపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి మార్కాపురంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది.

మాగుంటకు మార్కాపురంలో ఘనస్వాగతం

మార్కాపురం, ఏప్రిల్‌ 19: ఒంగోలు ఎంపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి మార్కాపురంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. ఎర్రగొండపాలెం అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్‌బాబు నామినేషన్‌ దాఖలు చేసిన అనం తరం మాగుంట శ్రీనివాసరెడ్డి మార్కాపురం వచ్చారు. జాతీయ రహదారి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. సుమారు 1000కి పైగా కూటమి కార్యకర్తలు మోటార్‌ సైకిళ్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు వీధి టీడీపీ నాయకులు మాగుంటను గజమాలతో సత్కరిం చారు. పట్టణంలో కళాశాలరోడ్డు, నాయుడువీధి, రథంబజారు, మెయిన్‌ బజార్‌ మీదుగా టీడీపీ కార్యాలయం ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ పోల్‌ మేనేజ్‌న్మెంట్‌ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో మోటర్‌సైకిల్‌ ర్యాలీ విజయవంతమైంది.

మార్కాపురం : జిల్లాలో వెనుకబడిన మార్కాపురం ప్రాంత అభివృద్ధికి హితోధికంగా కృషి చేస్తానని ఎంపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాల యంలో శుక్రవారం మార్కాపురం పట్టణ, మండల టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేసి కరువును పాలదోలతా మన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమార్పులు తీసుకువచ్చి ఐటీ రంగ అభివృద్ధికి తోడ్పడింది చంద్రబాబునాయుడేనన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ప్రపంచానికి పరిచ యం చేసిన ఘనత మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాడికే దక్కుతుందన్నారు. మాజీఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతు మాగుంట కుటుంబ సేవానిరతితో గతంలో మార్కాపురం ప్రాంతం లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పోల్‌ మేనేజ్‌న్మెంట్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్మదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పి.వి.శివారెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పి.వి.కృష్ణారావు, జనసేన నాయకులు ఎన్‌వి.సురేష్‌, సయ్యద్‌ జావిద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:46 AM