Share News

పెళ్లింట విషాదం

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:59 PM

వారంతా నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వధువు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు. తెలంగాణలోని పాల్వంచలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. వధూవరులతోపాటు ఇతర బంధుమిత్రులు బస్సులో వస్తుండగా, వారు కందుకూరు చేరుకునే లోపు ఇంటి వద్ద పనులన్నీ చక్కబెడదామన్న ఆలోచనతో ముందుగా కారులో బయల్దేరారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం దాటిన వెంటనే వారి కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుకు రెండో వైపు వెళ్లి మార్జిన్‌లో ఉన్న సిమెంటు దిమ్మెను ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి అరుణ (50), చిన్నమ్మ కుమార్తె శ్రావణి (22), మేనమామ భార్య దివ్య (28) అక్కడికక్కడే మృతి చెందారు. వధువు సోదరుడు వేణు, మేనమామ వినోద్‌.. ఆయన మూడేళ్ల కుమారుడు అభిరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.

పెళ్లింట విషాదం
ప్రమాద స్థలంలో మృతదేహాలను పోస్టుమార్టానికి తరలిస్తున్న పోలీసులు

రోడ్డు ప్రమాదంలో వధువు తల్లి, ఇద్దరు బంధువులు మృతి

మరో ముగ్గురికి తీవ్రగాయాలు

అందరూ కందుకూరు వాసులే

కారు అదుపుతప్పి మార్జిన్‌లో దిమ్మెను ఢీకొనడంతో ప్రమాదం

తూర్పునాయుడుపాలెం సమీపంలో ఘటన

ఒంగోలు(క్రైం), మార్చి 28 : వారంతా నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వధువు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు. తెలంగాణలోని పాల్వంచలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. వధూవరులతోపాటు ఇతర బంధుమిత్రులు బస్సులో వస్తుండగా, వారు కందుకూరు చేరుకునే లోపు ఇంటి వద్ద పనులన్నీ చక్కబెడదామన్న ఆలోచనతో ముందుగా కారులో బయల్దేరారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం దాటిన వెంటనే వారి కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుకు రెండో వైపు వెళ్లి మార్జిన్‌లో ఉన్న సిమెంటు దిమ్మెను ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి అరుణ (50), చిన్నమ్మ కుమార్తె శ్రావణి (22), మేనమామ భార్య దివ్య (28) అక్కడికక్కడే మృతి చెందారు. వధువు సోదరుడు వేణు, మేనమామ వినోద్‌.. ఆయన మూడేళ్ల కుమారుడు అభిరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.

గంటలో ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం

వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయాణిస్తున్న కారు మ రో గంటలో కందుకూరు చేరుకునేది. ఈలోపే ముగ్గురు మహిళలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తూర్పునాయుడుపాలెం దాటగానే పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారు 120కిమీ వేగంతో వెళుతున్నట్లు భావిస్తున్నారు. దీంతోపాటు నిద్రమత్తు కూడా కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే హైవే ఎస్సై నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సి బ్బంది సాయంతో కారు నుంచి మృతులను, క్షతగాత్రుల ను బయటకు తీశారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు పంపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, బంధువుల

వెనుకనే వస్తున్న పెళ్లి బస్సు, ఇతర వాహనాల్లో ఉన్న బంధువులు ప్రమాద స్థలం వద్ద దిగి కన్నీరు మున్నీరయ్యారు. దివ్య అక్కడికక్కడే మృతి చెందడం.. ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడటం అందరినీ కలచి వేసింది. చెల్లి పెళ్లి చేసిన ఆనందం ఇంటికి వెళ్లే వరకు కూడా లేదని, తన తల్లి కళ్ల ముందే ప్రాణాలు విడిచిందని వేణు బోరున విలపించారు. తన కళ్ల ముందే భార్య దివ్య రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూసి వినోద్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

సమాచారం అందుకున్న ఒంగోలు డీఎస్పీ కిషోర్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అప్పటికే అక్కడున్న సింగరాయకొండ సీఐ రంగనాథ్‌ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. సంఘటనపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, బంధువుల

వెనుకనే వస్తున్న పెళ్లి బస్సు, ఇతర వాహనాల్లో ఉన్న బంధువులు ప్రమాద స్థలం వద్ద దిగి కన్నీరు మున్నీరయ్యారు. దివ్య అక్కడికక్కడే మృతి చెందడం.. ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడటం అందరినీ కలచి వేసింది. చెల్లి పెళ్లి చేసిన ఆనందం ఇంటికి వెళ్లే వరకు కూడా లేదని, తన తల్లి కళ్ల ముందే ప్రాణాలు విడిచిందని వేణు బోరున విలపించారు. తన కళ్ల ముందే భార్య దివ్య రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూసి వినోద్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.

Updated Date - Mar 28 , 2024 | 11:59 PM