Share News

‘దర్శి’ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తా!

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:08 PM

దర్శి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. మండలంలోని కట్టసింగన్నపాలెం, గంగపాలెం గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు.

‘దర్శి’ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తా!
కురిచేడు: పడమరవీరాయపాలెం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న గొట్టిపాటి లక్ష్మి

కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

దర్శి, ఏప్రిల్‌ 19 : దర్శి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. మండలంలోని కట్టసింగన్నపాలెం, గంగపాలెం గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి పూలవర్షం కురిపించారు. ఈసందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మీరు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. మీ ఇంటి ఆడపడుచుగా ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దర్శిలో స్ధిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజలకు నిస్వార్ధ సేవలందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

టీడీపీలో భారీగా చేరికలు

దర్శి, ఏప్రిల్‌ 19: దర్శి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్‌ లలిత్‌సాగర్‌ సమక్షంలో బండివెలిగండ్ల సర్పంచ్‌ వర్నె రమణమ్మ, ఆమె కుమారుడు కాశి తదితరులు టీడీపీలో చేరారు. అంతకుముందు మండలంలోని చిన్నఉయ్యాలవాడ గ్రామానికి చెందిన 15 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈసందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. టీడీపీ పాలనలోనే న్యాయం జరుతుందనే విశ్వాసంతో భారీగా పార్టీలోకి చేరుతున్నారని చెప్పారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తామన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు రూపినేని వెంకటరావు, సాధం వెంకటేశ్వర్లు, రూపినేని రామారావు, పోలంరెడ్డి వీరనాగిరెడ్డి, అంబటి గోవిందరెడ్డి, కుమ్మల రోశయ్య, తోటా కేటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ ఎంపీటీసీ, పలు కుటుంబాలు టీడీపీలో చేరిక

దర్శి, ఏప్రిల్‌ 19: టీడీపీలోకి చేరికలు ఉధృతమవుతున్నాయి. మండలంలోని వైసీపీ చందలూరు ఎంపీటీసీ అంధం సత్యనారాయణ, ఆయన సోదరుడు సత్యం, నాయకులు సెట్టినేని సత్యనారాయణ, సెట్టినేని శ్రీనివాసరావులు టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్‌ లలిత్‌సాగర్‌ సమక్షంలో శుక్రవారం సాయంత్రం టీడీపీలో చేరారు. అలాగే, దేవవరం పంచాయతీలోని శేషంవారిపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వలసలు జోరు పెరుగుతుండటంతో టీడీపీ క్యాడర్‌లో రోజురోజుకు జోష్‌ పెరుగుతుంది

సమస్యల పరిష్యారానికి కృషి

కురిచేడు, ఏప్రిల్‌ 19: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని పడమర వీరాయపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ఆమెకు నీరాజనాలు పట్టారు. బీసీ కాలనీ, వెంగాయపాలెం గ్రామాలలో ప్రచారం నిర్వహించి పడమర వీరాయపాలెం గ్రామం వెళ్ళడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టింది. ప్రజలు ఎక్కడికక్కడ ఆపి ఆమెతో మమేకమవుతుండటంతో ప్రచారం ఆలస్యం అవుతున్నది. ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడి సమస్యలు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. పడమర వీరాయపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, పమిడి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

40 కుటుంబాలు టీడీపీలో చేరిక

కురిచేడు, ఏప్రిల్‌ 19: కురిచేడు మండలం బయ్యవరం, పెద్దవరం, పడమర గంగవరం గ్రామాలకు చెందిన 40 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పిడతల నెమిలయ్య,బొల్లేపల్లి ఆదినారాయణ, అడుసుమల్లి పెద్దసాంబయ్య, తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:08 PM