Share News

ఉగ్ర వెంటే మేమూ..

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:22 AM

ముస్లిం కుటుంబాలన్నీ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి వెంటే మేమూ అంటూ వైసీపీని వీడి పెద్ద ఎత్తున భారీగా పార్టీలో చేరుతున్నారు. దీంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఎలాగైనా ముస్లిం కుటుంబాల చేరికలను అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం ముస్లిం కుటుంబాలను ఆకట్టుకునేందుకు రంజాన్‌ పండుగను అవకాశంగా తీసుకుని ఉపవాసదీక్షలో ఉన్న ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్‌ విందులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఉగ్ర వెంటే మేమూ..
వైసీపీని వీడి పెద్దఎత్తున డాక్టర్‌ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరిన ముస్లిం కుటుంబాలు

అడ్డుకునేందుకు వైసీపీ ఇఫ్తార్‌ విందులతో ఆహ్వానాలు

కనిగిరి, ఏప్రిల్‌ 4: ముస్లిం కుటుంబాలన్నీ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి వెంటే మేమూ అంటూ వైసీపీని వీడి పెద్ద ఎత్తున భారీగా పార్టీలో చేరుతున్నారు. దీంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఎలాగైనా ముస్లిం కుటుంబాల చేరికలను అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం ముస్లిం కుటుంబాలను ఆకట్టుకునేందుకు రంజాన్‌ పండుగను అవకాశంగా తీసుకుని ఉపవాసదీక్షలో ఉన్న ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్‌ విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తంతు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో మొదలైంది. రంజాన్‌ మాసంలో ఎవరూ ఆహ్వానించినా, పేద,ధనిక తేడా అనేదే లేకుండా వారు శక్తి కొలది ఏర్పాటు చేసిన విందునే సంతృప్తిగా ఆ అల్లా సమకూర్చినట్లుగా భావించి ముస్లింలు భుజిస్తారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇప్తార్‌ విందును కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం సిగ్గుచేటు. దీంతో ముస్లిం కుటుంబాల్లో ఒకింత అసహనాన్ని కల్పిస్తున్నట్లుగా నగరంలో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు విందు కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:22 AM