Share News

మన బూత్‌ బాధ్యత మనదే

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:30 PM

మన బూత్‌ బాధ్యత మన దేనని.. నిబద్ధతతో పనిచేస్తే వచ్చే ఎనికల్లో అఖండ వి జయం మనదేనని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కనిగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

మన బూత్‌ బాధ్యత మనదే
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర

నిబద్ధతతో పనిచేస్తే విజయం మనదే

డబుల్‌గేమ్‌ పద్ధతి

మార్చుకోవాలని హితవు

టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, ఫిబ్రవరి 29 : మన బూత్‌ బాధ్యత మన దేనని.. నిబద్ధతతో పనిచేస్తే వచ్చే ఎనికల్లో అఖండ వి జయం మనదేనని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కనిగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి నాయకుడూ వారి వారి బూత్‌ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రతి నాయకు డు, కార్యకర్త ఆయా మండలాల్లో యూనిట్‌, క్లస్టర్‌ ఇ న్‌చార్జి, గ్రామ, వార్డు, మండలపార్టీ అధ్యక్షుడితో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్ని చురుకుగా నిర్వహించాలని సూచించారు. ఇంకా ఎన్నికలు 50 రో జులు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. మార్చి 5వ తేదీన జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ కనిగిరి నియోజకవర్గానికి రానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పార్టీకి వెన్నంటి ఉండి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్‌చార్జి దొడ్దా వెంకటసుబ్బారెడ్డి, నాయకులు వీవీఆర్‌ మనోహరరావు, రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గంలోని వివిధ మండలపార్టీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, మాజీ మం డలపార్టీ అధ్యక్షులు గాయం తిరుపతిరెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, తెలుగుమహిళలు పాల్గొన్నారు.

2

Updated Date - Feb 29 , 2024 | 11:30 PM