Share News

ఆర్థికంగా చితికిపోయాం

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:36 PM

ఉపాధి హామీ పథకం నిధుల మ్యాచింగ్‌తో అనేక పనులు చేశాం. సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్‌లు, బల్క్‌మిల్క్‌ సెంటర్‌లూ నిర్మించాం. నేటికీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. ఆర్థికంగా చితికిపోయాం. వెంటనే బిల్లులు ఇప్పించండి’ అని రాష్ట్ర మంత్రి, వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురే్‌షను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు. ఈమేరకు పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించారు.

ఆర్థికంగా చితికిపోయాం
వైసీపీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి సురేష్‌

చేసిన పనులు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం

వెంటనే డబ్బులు ఇప్పించండి

మంత్రి సురే్‌షకు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల వినతి

అధికారులు మాట వినడం లేదని ఫిర్యాదు

కొండపి, జనవరి 9 : ‘ఉపాధి హామీ పథకం నిధుల మ్యాచింగ్‌తో అనేక పనులు చేశాం. సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్‌లు, బల్క్‌మిల్క్‌ సెంటర్‌లూ నిర్మించాం. నేటికీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. ఆర్థికంగా చితికిపోయాం. వెంటనే బిల్లులు ఇప్పించండి’ అని రాష్ట్ర మంత్రి, వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురే్‌షను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు. ఈమేరకు పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామ సచివాలయాలకు మంజూరైన నిధులతో చేసిన పనులకు కూడా డబ్బులు రాలేదని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతరత్రా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ప్రభుత్వం వివిధ రూపాల్లో వారిని పరుగులుపెట్టించి పనులు పూర్తి చేయించింది. దీంతో అనేక మంది అప్పులు తెచ్చి పనులు చేశారు. తీరా బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కొందరు అప్పులకు వడ్డీలు చెల్లించలేక అవస్థపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి సురేష్‌ సోమవారం కొండపిలో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

అధికారులపై ఫిర్యాదు

మండల అధికారులు తమ మాట వినడం లేదని మంత్రి సురే్‌షకు అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో, విద్యుత్‌ శాఖ ఏఈ, ఇతర శాఖల అధికారులు తాము అడిగిన న్యాయమైన పనులను కూడా చేయడం లేదని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి పరిస్థితిని చక్కదిద్దుతానని హామీఇచ్చారు. అంతేకాకుండా తమ పరిధిలోని ఏరుల నుంచి ఇసుకను మండలంలోని వేరే గ్రామాల వైసీపీ నాయకులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని, దీన్ని నిలువరించాలని ముసి, అట్లేరు పరివాహక ప్రాంతాల వైసీపీ నాయకులు మంత్రిని కోరారని తెలిసింది. నాయకులు చెప్పిన అన్ని సమస్యలను రాబోయే రోజుల్లో కూర్చుని పరిష్కరిస్తానని నాయకులకు మంత్రి సురేష్‌ హామీనిచ్చారని తెలిసింది.

Updated Date - Jan 09 , 2024 | 11:36 PM