58 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీరు
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:14 AM
జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎదు ర్కొంటున్న ప్రజల అవసరాలను తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా 58 ఆవా సాలకు నీటిని అందిస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మర్దన్ ఆలీ మంగ ళవారం తెలిపారు.

ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మర్దన్ ఆలీ
ఒంగోలు (కలెక్టరేట్), మార్చి 5 : జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎదు ర్కొంటున్న ప్రజల అవసరాలను తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా 58 ఆవా సాలకు నీటిని అందిస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మర్దన్ ఆలీ మంగ ళవారం తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టినట్లు చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు, ఏఈఈలు, ఏఈలు ఇచ్చిన నివేదికల ఆధారం గా నీటి సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.