Share News

అభివృద్ధిని చూసి ఓటేయ్యండి

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:23 AM

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గిద్దలూరు నియోజవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధిని చూసి ఓటేయ్యండి

కొమరోలు, ఏప్రిల్‌ 15: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గిద్దలూరు నియోజవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని అల్లీనగరం, బ్రాహ్మణపల్లి పంచాయతీలోని గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏటా రూ.20 వేల సాయం అంద జేయనున్నట్లు తెలిపారు. మహిళలకు మహిళా శక్తి పధకం ద్వారా మహిళలకు ఆర్‌టీ సీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ను కల్పిస్తున్నారు. వెనుకబడిన మన ప్రాంతానికి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్మో హన్‌రెడ్డి మరో మారు కోడికత్తి డ్రామాకు తెరపైకి తీశారన్నారు. మరోసారి మోసపోవడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే, వలంటీ ర్లను తొలగించకుండా నెలకు రూ.10 వేల జీతం ఇవ్వను న్నట్లు తెలిపారు. తాను స్థానికుడినని స్థానికంగా అందు బాటులో ఉంటానని గిద్దలూరులోనే ఉంటూ ప్రజలకు సేవచేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత వైసీపీ అభ్యర్ధిని మార్కాపురం ప్రజలు తిరస్కరిస్తే గిద్దలూరుకు వచ్చారని, వారిని ఇక్కడ ప్రజలు నమ్మ పరిస్ధితి లేదన్నారు. మే13న జరిగే ఎన్నికల్లో స్ధానికుడనైన తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డిను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు బిజ్జాల తిరుమలరెడ్డి, సొసైటీ మాజీ అద్యక్షులు పులకుర్తి వెంకటేశ్వర్లు, కో-ఆర్షన్‌ మాజీ సభ్యుడు షేక్‌ నబీ, నాయకులు కాంట్రాక్టర్‌ కృష్ణమోహన్‌రెడ్డి చలిచీమల శ్రీనివాస చౌదరి, లక్ష్మినరసయ్య, గోడి ఓబుల్‌రెడ్డి, ఎ మోహన్‌రెడ్డి, గోపాలక్రిష్ణయ్య, బోయిళ్ల బాలిరెడ్డి, పందరబోయిన గంగయ్య, నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్‌ రెడ్డి విజయం కోసం ఆయన సతీమణి ముత్తుము ల పుష్పలీల, సోదరి గీత సోమవా రం విస్తృతంగా పర్యటిం చారు. ముత్తుముల పుష్పలీల పట్టణంలోని 5వ వార్డు, సాయంత్రం నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లి, మిట్టమీదిపల్లి గ్రామాల లో ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మానిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలను ఆమె ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గిద్దలూరు పట్టణంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయం లో నాటి టీడీపీ హయాంలో ముత్తుముల అశోక్‌రెడ్డి గుండ్లమోటు సమీపం నుంచి పైపు లైన్‌ ద్వారా పట్టణ ప్రజలకు నీరు అందించేందుకు నాడు కృషి చేశారన్నారు. ఆ కృషి ఫలితమే నేడు పట్టణంలో నీటిసమస్య లేకుండా ఉందన్నారు. ఆమె వెంట కౌన్సిలర్లు పాలుగుళ్ల శ్రీదేవి, జయలక్ష్మి, గడ్డం భాస్కర్‌రెడ్డి, లొక్కు రమేష్‌, పట్టణ పార్టీ అధ్యక్షులు షన్షావలి, టీడీపీ నాయకులు పాముల వెంకటరమణయాదవ్‌, బిల్లా రమేష్‌, సంపత్‌ రెడ్డి, రామాంజనేయులు, దుత్తా బాలీశ్వరయ్య, పందీటి రజనీకుమార్‌, బొంతా లక్ష్మీదేవి, గడ్డం రమ, పాల్గొన్నారు.

ఆకవీడులో సోదరి గీత ప్రచారం

రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి విజయం కోసం ఆయన సోదరి గీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్థానికంగా నివాసం ఉండే వ్యక్తి అశోక్‌రెడ్డి అని ఆమె అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేసున్న ముత్తుముల అశోక్‌రెడ్డికి, ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి, వేయించి గెలిపించాలని కోరారు. ఆమె వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:23 AM