Share News

వైపాలెం ఎస్సైపై వేటు

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:46 PM

వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టిన ఎస్సైపై వేటు పడింది. ఎర్రగొండపాలెంలో పనిచేస్తున్న ఎస్‌ఐ సుదర్శన్‌ను సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రేంజి ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. ఎ

వైపాలెం ఎస్సైపై వేటు
ఎస్సై సుదర్శన్‌

వసూళ్ల పర్వంపై విచారణ

సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు

ఒంగోలు(క్రైం), జూలై 5: వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టిన ఎస్సైపై వేటు పడింది. ఎర్రగొండపాలెంలో పనిచేస్తున్న ఎస్‌ఐ సుదర్శన్‌ను సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రేంజి ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల ఖర్చుల కోసమంటూ వ్యాపార సంఘాలను పిలిపించి ఒక్క సంఘం నుంచి రూ.20 వేలకు తగ్గకుండా ఇవ్వాలని ఎస్సై డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. త్వరలో తాను బదిలీ అవుతున్నానని, అప్పులయ్యానంటూ ఎన్నికల సమయంలో నేరుగా వసూళ్లపర్వం ప్రారంభించాడు. అంతేకాదు స్వయంగా పోలీసు స్టేషన్‌కు పిలిపించుకొని కనీసం రూ.15వేలకు తగ్గకుండా ఇవ్వాలని వ్యాపారులకు హుకుం జారీ చేశారు. దీంతో వ్యాపారులు కలవరం చెందారు. ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ బాలసుందరావు విచారణ నిర్వహించారు. సమగ్ర నివేదికను గుంటూరు రేంజీ ఐజీకి పంపారు. ఎస్‌ఐ సుదర్శన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎస్సై అవినీతి ఆరోపణలు మండలంలో చర్చనీయాంశం కావడంతో ఎస్పీ విచారణ చేయించారు.

Updated Date - Jul 05 , 2024 | 11:46 PM