Share News

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 25 , 2024 | 10:50 PM

ఎన్నికల కౌంటింగ్‌ జ రగనున్న నేపథ్యంలో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు జిల్లా బహిష్కరణ తప్పదని ఐజీ సర్వశ్రేషిత్‌ త్రిపాఠి హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్‌ జరుగనుండడంతో శనివా రం చీరాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సమీక్షించారు.

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఐజీ త్రిపాఠీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ఐజీ సర్వశ్రేషిత్‌ త్రిపాఠీ

చీరాలటౌన్‌, మే25 : ఎన్నికల కౌంటింగ్‌ జ రగనున్న నేపథ్యంలో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు జిల్లా బహిష్కరణ తప్పదని ఐజీ సర్వశ్రేషిత్‌ త్రిపాఠి హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్‌ జరుగనుండడంతో శనివా రం చీరాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ముందుగా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పుష్పగుచ్చం అందజేసి స్వాగతించారు. అనంతరం పోలీస్‌ అధికారులతో ఇటీవల జరిగిన పలు గొడవలకు సంబంధించి నమోదైన కేసులు, వాటి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో మాట్లాడుతూ ఇప్పటికే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా మరికొందరిని గుర్తించినట్లు చె ప్పారు. అన్ని విధాలా జిల్లా పోలీస్‌ యంత్రాం గం పటిష్టంగా ఉందని సూచించారు. విజయోత్సవ కార్యక్రమాలు, బాణసంచాలు నిషేధమన్నారు. భిన్నంగా వ్యవహరిస్తే శిక్షలు తప్పవని ఐజీ హెచ్చరించారు. కార్యక్రమంలో చీరాల డీ ఎస్పీ బేతపూడి ప్రసాద్‌, ఎస్బీ సీఐ మల్లికార్జునరావు, సీఐలు సోమశేఖర్‌, శేషగిరిరావు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 10:50 PM