టీడీపీ శ్రేణుల విజయోత్సవాలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:38 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నాయి.

కంభం, జూన్ 6 : రాష్ట్రంలో టీడీపీ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ రాక్షసపాలన పోయి టీడీపీ అఖండ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా మండలంలోని టీడీపీ నాయకు లు మూడు రోజులుగా బాణాసంచా కాలుస్తూ, సంబరాలు చేసుకున్నారు. గురువారం కంభం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు సయ్యద్ రఫి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్‌ను కట్ చేశారు. బస్టాండ్ ఆవరణలో లడ్డు, మిఠాయిలు పంచిపెట్టారు. రఫి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిందన్నారు. రాష్ట్రాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గాడినపెట్టి ప్రజల కష్టాలు తీరుస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు సయ్యద్ అనీస్‌అహమ్మద్, రాష్ట్ర మైనారిటీసెల్ నాయకులు దాదా, టీడీపీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు, కేతం శ్రీనివాసులు, ఎస్సీసెల్ నాయకులు గోన చెన్నకేశవులు, ఎన్‌టిఆర్‌గౌస్, బిజ్జాల కిశోర్, సోమయ్య, రమణ, ఫయాజ్, పాల్గొన్నారు.
ప్రజాసంక్షేమమే టీడీపీ ధ్యేయం
పొదిలి : ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ రసూల్ మహమ్మద్ అన్నారు. టీడీపీ పాలనలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగు తుందన్నారు. వైసీపీ పాలన దుర్మార్గం, దోపిడితోనే సాగిందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రాని కి తీరని అన్యాయం జరిగిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా చేశాడన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేయడంతో సుమారుగా 20 ఏళ్లు వెనక్కు పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నిటి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు జూన్ 4న చంద్రబాబు నాయుడికి స్పష్టమైన తీర్పును ఇచ్చారన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు టీడీపీని ఆధరించడంతో అభినందించారు. చంద్రబాబునాయుడి సారధ్యంలోనే ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.
కార్యకర్తల కృషి ఫలితంతో టీడీపీ విజయం
మార్కాపురం : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడానికి ముఖ్యకారణం కార్యకర్తల కృషే నని పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి అన్నారు. స్థానిక పట్టణ పార్టీ కార్యాలయంలో గురువారం 13వ బ్లాకుకు చెందిన తెలుగు యువత కార్యకర్తలు కేక్ కత్తి రించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మిఠాయి లు పంచారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా శక్తివంచన లేకుండా పనిచేశారని మౌలాలి అన్నారు. టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాంటివారిని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మేడికొండ వెంకటేశ్వర్లు, పూసల ప్రఽసాద్, వెంకటరెడ్డి, వేణుకుమార్, నరేంద్ర, విజయ్ పాల్గొన్నారు.
న్యాయవాదుల ఆధ్వర్యంలో సంబరాలు
పొదిలి : టీడీపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా పట్టణంలోని 8వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీకేక్ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర టీడీపీ లీగల్‌సెల్ కార్యదర్శి ఎస్‌ఎం బాషా ఆధ్వర్యం లో నాయకులు, కార్యకర్తలు పసుపు రంగులు చల్లుకుం టూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభిమాన నాయకుడు చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా, కందుల నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్‌కట్ చేసి అభిమాను లకు పంచిపెట్టారు.
ముస్లింలు అండగా నిలిచారు : హుస్సైన్‌బేగ్
మార్కాపురం వన్ టౌన్ : రాష్ట్రంలోని ముస్లింలు అంతా ఏక పక్షంగా ఉండి టీడీపీకి అండగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ మైనార్టీల హక్కుల పరిరక్షణ సమి తి మార్కాపురం డివిజన్ అధ్యక్షులు మొఘల్ జాబిర్ హుస్సేన్‌బేగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఘన విజయం సాధించడంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కీలక పాత్ర పోషించిందని, సమితి రాష్ట్ర అధ్యక్షు లు ఫారుక్ షుబ్లి ముఖ్యభూమిక పోషించారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలనను అంతం చేసి ప్రజాపాలన వచ్చేలా ప్రజలంతా ఏకమయ్యారని అన్నారు. టీడీపీతోనే రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి సాధ్యం అన్నారు.