Share News

బస్సు దగ్ధం ఘటనపై విష ప్రచారం

ABN , Publish Date - May 16 , 2024 | 10:10 PM

ప్రమాదం జరిగి కుటుబాలు శోకసంద్రంలో ఉంటే సా నుభూతి తెలపాల్సిన పరిస్థితుల్లో సంఘటనపై విషప్రచారం చేయడం పత్రికల విలువను దిగజార్చడమేనని జడ్పీటీసీ మాజీ సభ్యుడు, సీనియర్‌ నాయకుడు కొల్లా సుభాష్‌ బాబు అన్నారు.

బస్సు దగ్ధం ఘటనపై విష ప్రచారం

సీఎం పత్రికలో తప్పుడు కథనం

ఖండించిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు

పర్చూరు, మే 16 : ప్రమాదం జరిగి కుటుబాలు శోకసంద్రంలో ఉంటే సా నుభూతి తెలపాల్సిన పరిస్థితుల్లో సంఘటనపై విషప్రచారం చేయడం పత్రికల విలువను దిగజార్చడమేనని జడ్పీటీసీ మాజీ సభ్యుడు, సీనియర్‌ నాయకుడు కొల్లా సుభాష్‌ బాబు అన్నారు. పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మం డలం పసుమర్రు సమీపంలోని ఈపూరువారిపాలెం వద్ద బస్సు దగ్ధమైన సంఘటనపై సీఎం పత్రికలో వచ్చిన దుష్ప్రచార వార్తపై ఆయన స్పందించారు. బాధ్యతతో సొంత ఊరిలో ఓటువేసుకొని తిరుగు ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు బస్సు దగ్ధమైన సంఘటనలో సజీవదహనం కావడం బాధాకరమన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు సానుభూతి ప్రకటించి ఓదార్చాల్సిన పరిస్థిల్లో ఇలా తప్పుడు రాతలు రాయడం దారుణమన్నారు. నోవా అగ్రిటెక్‌ ప్రొటెక్ట్స్‌కు సంబంధించి ఏమైన ప్రమాదకరమైన రసాయనాలు తరలించారా అని అనుమానాలను రేకెత్తించే విధంగా అసత్య వార్తలు రాయడాన్ని ఖండించారు. వ్యవసాయ సీజన్‌ ముగిసి మూడు నెలలైందని, ఈ సమయంలో వీటిని తీసుకువెళ్లడం ఏమిటనేది వారికే తెలియాలన్నారు. బస్సు డ్రైవ ర్‌ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాలిలో కలసి పోయాయన్నారు. మృతుల కు టుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 10:10 PM