Share News

డీఎంహెచ్‌వోగా వెంకటేశ్వర్లు

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:17 AM

జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కృష్ణబాబు శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.

డీఎంహెచ్‌వోగా వెంకటేశ్వర్లు

ఉద్యోగోన్నతిపై నియామకం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కృష్ణబాబు శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. డీఎంహెచ్‌వోలుగా ఉద్యోగోన్న తులు కల్పించేందుకు కమిషనర్‌ కార్యాలయంలో ఇటీవల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అందులో బాపట్ల డీఐవోగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుకు ఉద్యోగోన్నతి లభించింది. దీంతో ఆయన్ను మన జిల్లాకు నియమించారు. ఇక్కడ డీఎంహెచ్‌వోగా పనిచేసిన రాజ్యలక్ష్మి ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి పాలన నడుస్తోంది. ఇప్పుడు రెగ్యులర్‌ డీఎంహెచ్‌వోగా నియమి తులైన వెంకటేశ్వర్లు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 01:17 AM