Share News

వెలిగొండ పూర్తే తొలిప్రాధాన్యత

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:47 AM

పశ్చిమ ప్రకాశం ఆయువు పట్టు అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం, రైతాంగానికి నీరు అందించడం ఎన్‌డీఏ కూటమితోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రజలకు తెలిపారు.

వెలిగొండ పూర్తే తొలిప్రాధాన్యత

కంభం (అర్థవీడు), ఏప్రిల్‌ 18 : పశ్చిమ ప్రకాశం ఆయువు పట్టు అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం, రైతాంగానికి నీరు అందించడం ఎన్‌డీఏ కూటమితోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రజలకు తెలిపారు. గిద్దలూరు నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 14వ రోజు అర్థవీడు మండలంలోని వెలగలపాయ, బొమ్మి లింగం, చెంచుకాలనీ, గన్నేపల్లి, రంగాపురం, యాచవరం, పోతురాజుటూరు, మాగుటూరు, కొత్తూరు, నాగులవరం, కాకర్ల గ్రామాలలో పర్యటించారు. గ్రామంలో పెద్దలను, కార్యకర్తలను, మహిళలను కలుసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు ను నారా చంద్రబాబునాయుడు 80శాతం పనులను పూర్తి చేస్తే అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం మిగిలిన 20శాతం పనులు పూర్తి చేయడానికే ఐదేళ్ల సమయం సరిపోలేదని యద్దేవచేశారు. ఎన్నికల సమయం వచ్చిన ప్పటికీ టన్నెల్‌ పూర్తికాకపోయినా జగన్‌ ప్రభుత్వం గారడి చేసి టన్నెల్‌ పూర్తి చేసినట్లు అబద్దపు ప్రచారాలు చేసి రైతులను మోసం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రైతులపై, వ్యవసాయ రంగంపై చిత్తశుద్ధి లేదన్నారు. రైతులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి వాహనాలు, రాయితీ రుణాలను ఎన్నో సంక్షేమ పథకా లను అందించినట్లు గుర్తుచేశారు. ఎన్‌డీఏ కూటమి అదికారంలోకి రాగానే గతంలో ఇచ్చిన సంక్షేమ పథకా లను అందిస్తూ అన్నదాతకు ఏటా రూ.20వేలు అందించనున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఎవరిపై కక్షసాధింపు చర్యలు చేయలేదన్నారు. తాను స్థానికుడినని, ప్రజలకు అందుబా టులో ఉంటానని, అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు, టీడీపీ, బీజేపీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి భార్య ముత్తుముల పుష్పలీల అన్నారు. గురువారం పట్టణంలోని 3వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేశారు. పుష్పలీల మాట్లాడుతూ నియోజకవర్గంలో అశోక్‌రెడ్డి శాసనసభ్యునిగా ఉన్న సమయంలో అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించారన్నారు. మే 13న జరిగే శాసన సభ, పార్లమెంటు ఎన్నికల్లో ముత్తుముల అశోక్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో పట్టణ పార్టీ అధ్యక్షులు షాన్షావలి, కౌన్సిలర్లు పాలుగుళ్ల శ్రీదేవి, చంద్రశేఖర్‌, బాలచెన్నయ్య. బొంతా లక్ష్మీదేవి పాల్గొన్నారు.

పాములపల్లెలో పుష్పలీలకు బ్రహ్మరథం

టీడీపీ అభ్యర్థి ముత్తుముల పుష్పలీల నగర పంచాయతీ పరిధిలోని పాములపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. గ్రామ పొలి మేర నుంచి మహిళలు గ్రామ టీడీపీ శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికాయి. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేని ఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిం చారు. ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపుతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆమె వివరించారు. ఆమె వెంట కౌన్సిలర్లు చంద్రశేఖర్‌యాదవ్‌, గడ్డం భాస్కర్‌రెడ్డి, లొక్కు రమేష్‌, ఎంపీటీసీ సభ్యుడు గర్రె శ్రీనాథ్‌, మాజీ సర్పంచ్‌ దప్పిలి భాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు దుత్తా బాలీ శ్వరయ్య, పాముల వెంకటరమణ యాదవ్‌, రఫీ, తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:48 AM