వాసవి క్లబ్స్ సేవలు అభినందనీయం
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:03 AM
ఒంగోలు వాసవి క్లబ్ అనుబంధ సంస్థలు నిర్వహి స్తున్న సేవలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్.రవిచంద్రన్ కితా బిచ్చారు.

క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్
ఒంగోలు(కల్చరల్), అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఒంగోలు వాసవి క్లబ్ అనుబంధ సంస్థలు నిర్వహి స్తున్న సేవలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్.రవిచంద్రన్ కితా బిచ్చారు. గురువారం నగరంలో పర్యటించిన ఆయ న వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ ఒంగోలు వి జన్, వాసవి క్లబ్ మహిళా విజన్, వాసవి క్లబ్ కేసీ జీఎఫ్ యూత్, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఏ ర్పాటుచేసిన పలు సేవా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సృ జనాత్మకత, సానుకూలతలను ఉపయోగించుకున్న వారు ఉన్నతస్థానానికి చేరతారని, వాసవి క్లబ్ నే డు వేలాదిమందికి అండగా నిలుస్తుందన్నారు. వా సవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బదరి నా రాయణ ఆధ్వర్యంలో చీదెళ్ల వెంకటప్రసాద్ దాతృ త్వంతో శాశ్వత ప్రాజెక్టు కింద సంతపేట షిరిడిసా యు మందిరానికి ఇనుపగేటును, పొత్తూరి శ్రీదేవి దంపతుల దాతృత్వంతో బండ్లమిట్ట ప్రభుత్వ బాలి కల ఉన్నత పాఠశాలకు 1000 లీటర్ల వాటర్ ట్యాం క్‌ను బహూకరించారు. అదేవిధంగా స్థానిక బొమ్మ రిల్లు ఆశ్రమానికి ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, అనాధ బా లలకు విద్యా సామగ్రి, బియ్యం, స్కూల్ యూని ఫాంలను పంపిణీ చేశారు. ఇక ఉమా మనోవికాస కేంద్రంలో నిత్యావసర వస్తువులు, సీతారామపురం సమతావేదిక వృద్ధాశ్రమంలో మహిళలకు రవిచం ద్రన్ చేతులమీదుగా చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయనను క్లబ్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్స్ అంత ర్జాతీయ కోశాధికారి శిద్దా సూర్యప్రకాశరావు, పేర్ల వెంకటసత్యనారాయణ, కూనల శ్రీనివాసరావు, చ లువాది కవితారాణి, సీహెచ్.పవన్‌కుమార్, నగేష్, ఎం.దుర్గాభవాని, కె.శ్రీనివాసరావు, నందకుమార్, భూమా శ్రీనివాసరావు, సునీల్‌కుమార్, సౌందర్య, సంపత్‌కుమార్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.