వైసీపీ ఖాళీ...!
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:51 PM
జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీ సైలెంట్‌గా జిల్లా కార్యాలయాన్ని మార్చింది. నిబంధలకు విరుద్ధంగా నిర్మించిన కొత్త కార్యాలయంలోకి సామగ్రిని తరలించింది. పాత కార్యాలయాన్ని స్థల యజమాని ఖాళీ చేయించగా కొత్త ఆఫీసు భవన నిర్మాణం వివాదాస్పదమవడంతో అక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి ఆపార్టీకి ఎదురైంది. చివరకు దివంగత రాజశేఖరెడ్డి జయంతిని కూడా నిర్వహించలేకపోయారు. కాగా సోమవారం వైఎస్ జయంతి కార్యక్రమాలు జిల్లాలో తూతూమంత్రంగా నిర్వహించారు. ఆపార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి, కరణం బలరాంతోపాటు కింది స్థాయిలో ముఖ్యనేతలు కూడా గైర్హాజరయ్యారు. కొన్నిచోట్ల నేతలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఒంగోలులో మేయర్‌తోపాటు వైసీపీ కార్పొరేటర్‌లు అంతా కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.

సైలెంట్‌గా ఆఫీసు మార్పు
వైఎస్ జయంతి కార్యక్రమాలకు బాలినేని, కరణం డుమ్మా
మమ అనిపించిన నేతలు
కొత్త కార్యాలయం నిర్మించిన భూమి వివాదాస్పదం
సీజ్ చేయకుండా కార్పొరేషన్ అధికారుల ఉదాసీనత
జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీ సైలెంట్‌గా జిల్లా కార్యాలయాన్ని మార్చింది. నిబంధలకు విరుద్ధంగా నిర్మించిన కొత్త కార్యాలయంలోకి సామగ్రిని తరలించింది. పాత కార్యాలయాన్ని స్థల యజమాని ఖాళీ చేయించగా కొత్త ఆఫీసు భవన నిర్మాణం వివాదాస్పదమవడంతో అక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి ఆపార్టీకి ఎదురైంది. చివరకు దివంగత రాజశేఖరెడ్డి జయంతిని కూడా నిర్వహించలేకపోయారు. కాగా సోమవారం వైఎస్ జయంతి కార్యక్రమాలు జిల్లాలో తూతూమంత్రంగా నిర్వహించారు. ఆపార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి, కరణం బలరాంతోపాటు కింది స్థాయిలో ముఖ్యనేతలు కూడా గైర్హాజరయ్యారు. కొన్నిచోట్ల నేతలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఒంగోలులో మేయర్‌తోపాటు వైసీపీ కార్పొరేటర్‌లు అంతా కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
రాష్ట్రంలో అధికారంలో ఉండగా వైసీపీ అన్ని జిల్లా కేంద్రాల్లో ప్యాలె్‌సల లాంటి పార్టీ కార్యాలయాలను నిర్మించింది. అందులో భాగంగా ఒంగోలులో కూడా కార్యాలయం ఏర్పాటు చేసింది. తిరిగి అధికారంలోకి వస్తే ఘనంగా ప్రారంభించాలని ఆపార్టీ నేతలు భావించారు. అధికారాన్ని కోల్పోవడంతో కార్యాలయ నిర్మాణంలో ఉన్న లొసుగులు కూడా బయటపడ్డాయి. దీనికితోడు ఏడెనిమిదేళ్ల నుంచి ఆపార్టీ కార్యాలయం నడుస్తున్న భవనాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆప్పట్లో మాజీ మంత్రి బాలినేని సన్నిహితుడు పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చారు. రెండేళ్ల నుంచి ఆయన ఖాళీ చేయాలని కోరుతున్నా అధికారంలో ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. వైసీపీ అధికారాన్ని కోల్పోగానే ఆయన ఒత్తిడి పెంచారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జంకె వెంకటరెడ్డి గుట్టుచప్పుడు కాకుండా ఆపార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. సామగ్రిని కూడా వివాదాస్పదంగా ఉన్న కొత్త పార్టీ కార్యాలయంలోకి తరలించారు. అక్కడ సోమవారం వైఎస్ జయంతి వేడుకల నిర్వహణకు పిలుపునిచ్చారు. కొత్త భవనం నిర్మించిన భూమి వివాదం కేసు హైకోర్టులో ఉంది. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని పోలీసులు వైసీపీ నేతలకు సమాచారమిచ్చారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ నేతలు కార్యక్రమాన్ని అక్కడి నుంచి మార్చుకున్నారు. అలాగే వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి పూర్తి అనుమతులు లేవు.
ఇలా వచ్చి అలా వెళ్లారు..
వైఎస్ జయంతి కార్యక్రమాలను అన్నిచోట్లా ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతరత్రా ముఖ్య నాయకులు హాజరుకావాలని వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. అయితే కీలకనేత బాలినేని శ్రీనివాసుల రెడ్డి గైర్హాజరయ్యారు. అదేసమయంలో కార్పొరేషన్ మేయర్, వైసీపీ కౌన్సిలర్లు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కనిగిరిలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నారాయణయాదవ్ తన మద్దతుదారులతో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ మద్దతుదారులతో తన గృహంలో కార్యక్రమం నిర్వహించారు. చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వారంతా జయంతి కార్యక్రమాలా ఇలా వచ్చి అలా వైఎస్ విగ్రహాలకు దండలు వేసి వెళ్లి పోవడం కనిపించింది.
కార్పొరేషన్‌లో కాక
వైఎస్సార్ జయంతి వేడుకలకు మేయర్ డుమ్మా!
అదేబాటలో వైసీపీ డిప్యూటీ మేయర్‌లు, కార్పొరేటర్లు
పలువురు ముఖ్య నేతలూ గైర్హాజరు.. నగరంలో చర్చనీయాంశం
ఒంగోలు (కార్పొరేషన్), జూలై 8 : ఒంగోలులో వైసీపీ రాజకీయం వేడెక్కింది. గత వైసీపీ పాలనలో ఏకార్యక్రమం జరిగినా నానా హడావుడి చేసిన నేతలు ఇప్పుడు ఆపార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. సోమవారం జరిగిన వైస్సార్ జయంతి వేడుకలకూ ముఖం చాటేశారు. ఆ పార్టీకి చెందిన నగర్ మేయర్ గంగాడ సుజాత, ఇద్దరు డిప్యూటీ మేయర్‌లు వెలనాటి మాధవరావు, వేమూరి బుజ్జిలతోపాటు ఇతర కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతోపాటు పలువురు ముఖ్యనేతలు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. వైఎస్సార్ జయంతి వేడుకలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని చర్చిసెంటర్‌లో నిర్వహించారు. ఒంగోలు కార్పొరేషన్‌లో మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్‌లు, మరో39 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కోఆప్షన్ సభ్యులు వైసీపీకి చెందిన వారు కాగా, వీరంతా కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో జంకె వెంకటరెడ్డి నేతృత్వంలో ద్వితీయ శ్రేణి, డివిజన్ నాయకులతో కార్యక్రమాన్ని మొక్కుబడిగా ముగించేశారు.
ఎన్నికల అనంతరం మారిన తీరు
ఒంగోలుకు కార్పొరేషన్ హోదా వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుం చి 44 మంది కార్పొరేటర్‌లు గెలిచారు. టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ఒక కార్పొరేటర్ విజయం సాధించారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అడ్డగోలుగా ఆమోదించడం సాగింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్‌లు ఆపార్టీని వీడి టీడీపీ జెండా కప్పుకున్నారు. దీంతో కూటమి సభ్యుల సంఖ్య 11కు చేరగా, వైసీపీ కార్పొరేటర్‌ల సంఖ్య 39కి పడిపోయింది. ఆతర్వాత జరిగిన పరిణామాలతో మేయర్‌తోపాటు, మరికొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో మేయర్ నివాసంలో సమావేశమైన వారు సైకిలెక్కడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అప్పటి నుంచి కొందరు టీడీపీ నేతలకు టచ్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో సోమవారం ఒంగోలులో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకలకు ఒక్కరూ హాజరు కాకపోవడంతో కార్పొరేషన్ పాలిటిక్స్ వేడెక్కాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెం కటరెడ్డి నేరుగామేయర్ సుజాతకు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదని సమాచారం. ఆమె వైసీపీలో ఉంటారా? లేక మరికొంత మంది కార్పొరేటర్‌లతో కలిసి టీడీపీ కూటమిలో చేరతారా? అన్నది చర్చనీయాంశమైంది.