Share News

వైసీపీ పాలనలో కనీవినీ ఎరుగని మోసం

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:46 AM

వైసీపీ పాలనలో కనీవినీ ఎరుగని మోసం జరుగుతోందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. పంచాయతీ పరిధిలోని ఈద్గామిట్టలో సోమవారం రాత్రి నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రచార ఆర్భాటం తప్పా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వ భవనాలకు ఆ పార్టీ రంగులు పులమటం, పట్టాదారు పాస్‌పుస్తకాలు, సర్వేరాళ్లు, చివరకూ మరుగుదొడ్లు, చెత్తబండ్లుపై కూడా జగన్‌ బొమ్మలు వేయటం ద్వారా వారి స్టిక్కర్ల పిచ్చి పతాక స్థాయికి చేరిందని ఎద్దేవా చేశారు.

వైసీపీ పాలనలో కనీవినీ ఎరుగని మోసం
ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే స్వామి, టీడీపీ నేతలు

సింగరాయకొండ, జనవరి 8 : వైసీపీ పాలనలో కనీవినీ ఎరుగని మోసం జరుగుతోందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. పంచాయతీ పరిధిలోని ఈద్గామిట్టలో సోమవారం రాత్రి నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రచార ఆర్భాటం తప్పా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వ భవనాలకు ఆ పార్టీ రంగులు పులమటం, పట్టాదారు పాస్‌పుస్తకాలు, సర్వేరాళ్లు, చివరకూ మరుగుదొడ్లు, చెత్తబండ్లుపై కూడా జగన్‌ బొమ్మలు వేయటం ద్వారా వారి స్టిక్కర్ల పిచ్చి పతాక స్థాయికి చేరిందని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ఇంతలా ప్రచార ఆర్భాటానికి ఉపయోగించిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. సంక్షేమం మాటున ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జగన్‌ చేసిన మోసాన్ని ఆ వర్గ ప్రజలు గమనించారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాల అభ్యున్నతికి అమలు చేసిన 100 పైగా సంక్షేమ పథకాలను రద్దుచేసి వారిని అఽధోపాతాళానికి తొక్కారని స్వామి మండిపడ్డారు. అధికారపార్టీ నాయకులు గంజాయి, మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నాసిరకం మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని చెప్పారు. సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం బాటలో పయనించాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు చీమకుర్తి కృష్ణ, షేక్‌ సంధానీబాషా, కూనపరెడ్డి సుబ్బారావు, సుదర్శి చంటి, మించల బ్రహ్మయ్య, అబ్దుల్‌ సుభాన్‌, యస్థాని, సనావుల్లా కరీం, సాజీద్‌ మాబాషా, మోటుపల్లి వెంకటేశ్వర్లు, కళ్లగుంట నరసింహ, పసుపులేటి శేషు, శీలం చంటి, రవిశంకర్‌రెడ్డి, వల్లెపు రవి, తుమ్మా కోటేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:46 AM