Share News

పాపం పాలేరు రిజర్వాయర్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:10 PM

పాలేరు ఆధారంగా చెన్నిపాడు సమీపంలోని సంగమేశ్వరం వద్ద 2006లో మంజూరైన సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ (పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్‌) అసంపూర్తిగానే ఆగిపోయింది. ప్రాజెక్ట్‌కు 2009లో అప్పటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య శిలాఫలకం వేశారు. 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు అందించే ఈప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి రూ.50.50 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

పాపం పాలేరు రిజర్వాయర్‌
శిలాఫలకం వద్ద సెల్ఫీచాలెంజ్‌ విసురుతున్న ఎమ్మెల్యే స్వామి (ఫైల్‌)

పదేపదే సీఎం నుంచి ఇన్‌చార్జిల వరకు హామీలు

ఐదేళ్లలో తట్ట మట్టి ఎత్తిందిలేదు

అటకెక్కిన నిర్మాణ పనులు

పొన్నలూరు(కొండపి), ఏప్రిల్‌ 27 : పాలేరు ఆధారంగా చెన్నిపాడు సమీపంలోని సంగమేశ్వరం వద్ద 2006లో మంజూరైన సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ (పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్‌) అసంపూర్తిగానే ఆగిపోయింది. ప్రాజెక్ట్‌కు 2009లో అప్పటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య శిలాఫలకం వేశారు. 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు అందించే ఈప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి రూ.50.50 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అప్పటి నుంచి కొంత వరకు స్పిల్‌వే పనులు అరకొరగా ముగ్గురు కాంట్రాక్టర్లు చేశారు. 2019 ఎన్నికల్లో ఈప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని ఇప్పటి సీఎం, అప్పటి ప్రతిపక్షనేత తన పాదయాత్రలో పొన్నలూరు మండలంలో కొనసాగిస్తూ హామీనిచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన మాదాశి వెంకయ్య తర్వాత వచ్చిన నాయకులు సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని హామీనిచ్చి మరిచారు. ఈప్రాంత రైతాంగం ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని 2019 నుంచి అధికార పార్టీ నాయకులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా ఈప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

Updated Date - Apr 27 , 2024 | 11:10 PM