అభివృద్ధికి నోచుకోని శివారు కాలనీలు
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:38 PM
అద్దంకి పట్టణం లోని పలు శివారు కాలనీలలో అభి వృద్ధి పనులు జరగక ప్రజలు అవ స్థలు పడుతున్నారు. వైసీపీ పాల నలో అద్దంకి పట్టణంలోని సీసీ రోడ్ల ఏర్పాటుకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. మున్సిపాలిటీలోని సాధారణ నిధులతో కొద్దిమేర మాత్రమే పనులు చేపట్టారు.
అవస్థలు పడుతున్న స్థానికులు
అద్దంకి, అక్టోబరు 20 (ఆం ధ్రజ్యోతి) : అద్దంకి పట్టణం లోని పలు శివారు కాలనీలలో అభి వృద్ధి పనులు జరగక ప్రజలు అవ స్థలు పడుతున్నారు. వైసీపీ పాల నలో అద్దంకి పట్టణంలోని సీసీ రోడ్ల ఏర్పాటుకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. మున్సిపాలిటీలోని సాధారణ నిధులతో కొద్దిమేర మాత్రమే పనులు చేపట్టారు. దీంతో అత్యధిక శాతం శివారు ప్రాంతాలలో అభివృద్ధి పనుల ఊసేలేదు. దీంతో ఉన్నపాటి మట్టి రోడ్లు ఛిద్రమయ్యాయి. చిన్నపాటి వర్షం పడ్డా రోడ్లపై నడి చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక సైడ్ డ్రైన్‌లు కూడా లేకపోవడంతో మురుగు నీరు రోడ్డు పైనే నిలిచి ఉంటుంది. ప్రధానంగా మౌలానగర్, గరటయ్య కాలనీ, ఎన్టీఆర్ నగర్, నాగులపాడు రోడ్డులోని పలు వీధులు బురదమయంగా మారుతున్నాయి. రాత్రి సమయంలో ప్రజలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతాయన్న ఆశతో ఆయా కాలనీవాసులు ఎదురు చూస్తున్నారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.