Share News

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:14 PM

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోలేకపోతే తెలుగుజాతి మనుగడకే కష్టమని కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లి, పామూరు మండలం నుచ్చపొద, సీఎస్‌పురం మండలం కేఅగ్రహారం, వెలిగండ్ల మండలంలోని గోకులం, రామ గోపాలపురం గ్రామాలకు చెందిన 175 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం
వైసీపీని వీడి టీడీపీలో చేరిన సీఎస్‌పురం మండలం కేఅగ్రహారం గ్రామస్ధులు

మరోసారి మోసపోవద్దని

కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్ర పిలుపు

175 కుటుంబాలు టీడీపీలో చేరిక

కనిగిరి, ఏప్రిల్‌ 13: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోలేకపోతే తెలుగుజాతి మనుగడకే కష్టమని కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లి, పామూరు మండలం నుచ్చపొద, సీఎస్‌పురం మండలం కేఅగ్రహారం, వెలిగండ్ల మండలంలోని గోకులం, రామ గోపాలపురం గ్రామాలకు చెందిన 175 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో మోసం చేస్తూ ఖజానాలోని సొమ్మంతా పథకాలకు మళ్ళించి, తిరిగి ఆ సొమ్మును తన వ్యాపారాల ద్వారా తన జేబుల్లోకి చేర్చుకున్న ఘనాపాటి జగన్‌ అని అన్నారు. ప్రజలు ఒక్క చాన్స్‌ ఇస్తేనే రాష్ట్రాన్ని దివాళా తీయించటమే కా కుండా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారని చెప్పారు. మరోసారి చాన్స్‌ ఇస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత దుర్భరంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ నేతలు మళ్ళీ ఓట్ల కోసం కల్ల బొల్లి మాటలు, హామీలు ఇస్తున్నా రన్నారు. వాటిని నమ్మవద్దని డాక్టర్‌ ఉగ్ర సూచించారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో ఏ పరిశ్రమను తీసుకురాలేదన్నారు. జగన్‌ వైఖరితో పారిశ్రామిక వేత్తలు పారిపోయారని చెప్పారు. చంద్రబాబును సీఎంగా చేసుకుంటే పారిశ్రా మికంగా రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందటంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కనిగిరి అభి వృద్ధి కోసం తాను సంకల్పించిన ఇంటింటికి తాగునీరు, వెలుగొండ జలాలు, నిమ్జ్‌, ట్రిపుల్‌ ఐఐటీ, నడికుడి రైల్వేలైన్‌ పూర్తి వంటి వాటిని సాధించుకు వస్తానన్నారు. తొలుత పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు వేసి సాదరం గా ఆహ్వానించారు.

కార్యక్రమంలో టీడీపీ వెలిగండ్ల మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు కేలం ఇంద్ర భూపాల్‌ రెడ్డి, పామూరు మాజీ ఎంపీపీ టి.అల్లూర య్య, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, బైరెడ్డి జయరామిరెడ్డి, పొంగులేటి సూరి తదితరులు పాల్గొన్నారు.

బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యం

పామూరు ఏప్రిల్‌ 13: బీసీల సంక్షేమానికి రూ.లక్షన్నర కోట్ల బడ్జెట్‌తో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కూటమి అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిరగళదిన్నె గ్రామంలో జయహో బీసీ సభకు ఎం. గం గరాజు యాదవ్‌ ఆధ్యక్షత వహించారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉగ్ర మాట్లాడుతు పరదాల చాటున పరిపాలన సాగించిన వైసీపీ పాలకులు నవరత్నాల పేరుతో ఉన్న పథకాలను రద్దుచేశారన్నారు. ఫలితంగా అన్నిరకాలుగా బీసీ సామాజిక వర్గం నష్టపోయారన్నారు. వైసీపీ నాయకులు కుల రాజకీ యాలకు తెరలేపుతున్నారని, వారి మాయమాటలు న మ్మి మరోసారి మోసపోవద్దన్నారు. తాను కులాలకు కన్నా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

ఈసందర్భంగా మాజీ సర్పంచ్‌ ఒంటేలు నాగేశ్వరరా వు, సుధాకరరెడ్డితోపాటు 35 కుటుంబాలు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీ లో చేరారు. అనంతరం ఉగ్రను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీలు జి.దశరథరామయ్య, ఆవుల నాగేశ్వరరావు, ఎంపీటీసీలు బొట్ల నాగార్జున, బొల్లా నరసింహారావు, టీడీపీ గ్రామ అఽధ్యక్షుడు ఆరేకొండ హరిప్రసాద్‌, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ కేవీ రమణయ్య, జనసేన నాయకుడు షేక్‌ సందాని బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 11:14 PM