Share News

ఒకటికి రెండు రెట్లు

ABN , Publish Date - May 26 , 2024 | 01:43 AM

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. నిన్న మొన్నటివరకు బెట్టింగ్‌ బాబులు ఇక్కడికి క్కడే పందేలు పెట్టుకున్నారు.

ఒకటికి రెండు రెట్లు

మార్కాపురం, మే 25: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. నిన్న మొన్నటివరకు బెట్టింగ్‌ బాబులు ఇక్కడికి క్కడే పందేలు పెట్టుకున్నారు. కానీ రెట్లు పెరగ డంతో బెట్టింగులు ప్రస్తుతం జిల్లాలు దాటుతు న్నాయి. మార్కాపురంలో అయితే రూపాయికి రూపాయి మాత్రమే నడుస్తున్నట్లు సమాచారం. అదే పక్క జిల్లాకు వెళితే మాత్రం ఒకటిన్నర నుంచి రెండు రెట్లు పందెం లభిస్తోంది. దీంతో మార్కాపురం ప్రాంతవాసులు పక్క జిల్లాలకు వెళ్లి అదృష్టం పరీక్షించుకునేందుకు పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది.

నరసరావుపేట కేంద్రంగా

మార్కాపురం ప్రాంతానికి చెందిన చాలా మంది బెట్టింగు రాయుళ్లు వారం రోజులుగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మకాం వేశారు. అక్కడివాళ్లు టీడీపీ అధికారంలోకి వస్తుందని తొలుత రూపాయికి రూపాయి బెట్టింగులు పెట్టారు. అప్పట్లో ఎవరూ పెద్దగా మొగ్గుచూపలేదు. కానీ రూపాయిన్నర ఇస్తారనే సరికి డబ్బుల సంచులతో ఈ ప్రాంతం వాళ్లు అక్కడ వాలారు. లక్షల్లోనే పందెం కాసేవాళ్లు వస్తుండడంతో మరో అర్థ రూపాయి పెంచారు. ఇంకేముంది రూపాయికి రెండు రూపాయలు వస్తాయన్న ఆఽశ కలిగి కోట్ల రూపాయలు పందేలు కాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్క మార్కాపురం పట్టణం వాళ్లే వైసీపీ అధికారంలోకి వస్తుందని ఐదు కోట్ల రూపాయలు నరసరావుపేటలో పందెం కాసినట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం, పొదిలి, తర్లుపాడు, కంభం, గిద్దలూరు ప్రాంతాల నుంచి నరసరావుపేట వెళ్లి రూ.25 కోట్ల వరకు పందేలు పెట్టినట్లు సమాచారం.

మధ్య మనిషికి రెండు శాతం కమిషన్‌

కోట్లతో వ్యవహారం కావడంతో ఇరు పక్షాల వాళ్లు మధ్య మనుషుల వద్ద డబ్బులు, విలువైన పత్రాలు, బ్యాంకు చెక్కులు, బంగారం తదితరాలు ఉంచుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ మొత్తం అయితే ఇరు పార్టీలు మధ్య మనిషికి బ్యాంకు ఖాతాల ద్వారా, యూపీఐ ద్వారా డబ్బులు చేరవేరుస్తున్నారు. కొందరైతే డబ్బు సంచులతో వాహనాల్లో వెళ్లి కాగితాలు రాయించుకుని నగదు ఇచ్చి వస్తున్నారు. పెద్ద మొత్తంలో పందేలు కాసే వాళ్లు మాత్రం ఆస్తి, పొలం పత్రాలు తదితరా లను మధ్య మనుషుల వద్ద పెడుతున్నారు. ఇంకొందరు నగదుకు బదులుగా బంగారాన్ని కూడా బెట్టింగులో పెడుతున్నట్లు సమాచారం. ఇలా రెండు వైపుల వారికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వాళ్లు ఒక్కొక్కరి వద్ద రెండు శాతం చొప్పున కమిషన్‌ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 08:32 AM