Share News

రామోజీరావుకు ఘన నివాళి

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:58 PM

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు జాతికి తీరని నష్టమని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకురాలు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి డాక్టర్‌ లక్ష్మి, ఆమె భర్త డాక్టర్‌ లలిత్‌సాగర్‌, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టిన గొప్ప దార్శనికుడని కొనియాడారు.

రామోజీరావుకు ఘన నివాళి
రామోజీరావు చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

దర్శి, జూన్‌ 8: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు జాతికి తీరని నష్టమని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకురాలు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి డాక్టర్‌ లక్ష్మి, ఆమె భర్త డాక్టర్‌ లలిత్‌సాగర్‌, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపార సంస్ధలను ఆరంబిం నిజాయితీకి మారుపేరుగా సంస్థలను నడిపారని ప్రశంసించారు. ఆయన నడిచిన మార్గం ప్రజలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్‌చైర్మన్‌ జి.స్టీవెన్‌, కౌన్సిలర్‌ వీసీ రెడ్డి, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు, మాజీ అఽధ్యక్షుడు దారం సుబ్బారావు, తెలుగు మహిళ నాయకురాలు శోభారాణి, మారెళ్ళ వెంకటేశ్వర్లు, గోవిదంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామోజిరావు మృతి తీరనిలోటు

కనిగిరి, జూన్‌ 8: అక్షర దిగ్గజం రామోజీరావు మృతి పత్రికా ప్రపం చానికి తీరనిలోటు అని తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శ్రీనివాసులురెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు రామోజీ అక్షరాలు సమరం చేశాయన్నారు. పేదవర్గాలకు అండగా ఆయన కథనాలు ఎంతో దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో జంషీర్‌, తమ్మినేని శ్రీని వాసులురెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, ఫిరోజ్‌, మూలె బ్రహ్మారెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, ,అహ్మద్‌, గుడిపాటి ఖాదర్‌, షరీఫ్‌, చిలకపాటి లక్ష్మయ్య, నజిముద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

అలాగే, దొనకొండ, పీసీపల్లి, తాళ్లూరు, ముండ్లమూరు, హనుమంతుని పాడు మండల కేంద్రాల్లోని టీడీపీ కార్యాలయాల్లో రామోజీరావు చిత్రపటానికి ఆపార్టీ నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు.

Updated Date - Jun 08 , 2024 | 10:58 PM