Share News

టీచర్ల బదిలీలు నిలిపివే త

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:32 PM

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు ప్రభుత్వం నుంచి బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులకు షాక్‌ తగిలింది. వాటి అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

టీచర్ల బదిలీలు నిలిపివే త

నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు

ఎన్నికల ముందు 95మందికి ఆర్డర్లు

ఒంగోలు(విద్య), జూన్‌ 6: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు ప్రభుత్వం నుంచి బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులకు షాక్‌ తగిలింది. వాటి అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో టీచర్ల బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌ నిబంధనలను విరుద్ధంగా సుమారు 1,400 మంది టీచర్లు ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్డర్లు పొందారు. వీరిలో జిల్లాలో సుమారు 95 మంది టీచర్లు ఉన్నారు. బదిలీల కౌన్సెలింగ్‌లో తాము కోరుకునే స్థానాలు దక్కవన్న భయంతో ఈ ఉపాధ్యాయులు ముందుగానే ప్రభుత్వం నుంచి ఆర్డర్‌ పొందారు. కొందరు వ్యక్తిగత బదిలీ, మరికొందరు పరస్పర బదిలీ ఉత్తర్వులు పొందారు. బదిలీలు పొందిన వారిలో కొందరు ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ఉన్నారు. రాజకీయ నాయకులు, అప్పటి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఈ బదిలీలకు శ్రీకారం చుట్టారు. బదిలీ కోసం ఒక్కో టీచర్‌ నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బదిలీల వ్యవహారాల్లో పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని ఒక అధికారి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బదిలీల్లో ఒక్కొక్క స్థానానికి ఇద్దరు, ముగ్గురికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు. వాటిపై తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు బదిలీ ఉత్తర్వులు నిలిపివేయమని విద్యాశాఖ ఆర్‌జేడీలు, డీఈఓలకు పాఠశాల విద్యా కమిషనర్‌ సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయంపై డీఈవో సుభద్రను వివరణ కోరగా బదిలీ ఉత్తర్వులు నిలివేయమని ఉత్తర్వులు వచ్చిన మాట వాస్తవమేనని ధ్రువీకరించారు.

Updated Date - Jun 06 , 2024 | 11:32 PM