14 మంది తహసీల్దార్‌లకు స్థానచలనం
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:40 PM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన 14 మంది తహసీల్దార్‌లకు ఇచ్చిన పోస్టింగ్ స్థానాలను మారుస్తూ కలెక్టర్ దినే్‌షకుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురికి కొత్తగా పోస్టింగ్‌లు ఇచ్చారు.
ఆరుగురికి కొత్తగా పోస్టింగ్‌లు
ఒంగోలు (కలెక్టరేట్), ఫిబ్రవరి 6 : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన 14 మంది తహసీల్దార్‌లకు ఇచ్చిన పోస్టింగ్ స్థానాలను మారుస్తూ కలెక్టర్ దినే్‌షకుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురికి కొత్తగా పోస్టింగ్‌లు ఇచ్చారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్లుగా బేస్తవారపేటలో పనిచేస్తున్న వి.లావణ్య, శ్రీకాంత్ కేథార్‌నాథ్, డి.మల్లికార్జునరావు, ఎం.నాగిరెడ్డిని నియమించారు. కె.రవికుమార్‌కు ఒంగోలు అర్బన్, ఎస్‌కే నాగూర్‌మీరాకు సీఎ్‌సపురం, ఎం.డానియేల్‌కు ఒంగోలు రూరల్ తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. నాగులుప్పలపాడులో పనిచేస్తున్న ఎం.సృజన్‌కుమార్‌ను గిద్దలూరు, ఎర్రగొండపాలెంలో పనిచేస్తున్న బి.సోమ్లానాయక్‌ను మార్కాపురం, ఒంగోలు అర్బన్‌లో పనిచేస్తున్న జి.సిద్ధార్థ్‌ను ఎర్రగొండపాలెం, మార్కాపురంలో పనిచేస్తున్న జి.రమే్‌షకుమార్‌ను చీమకుర్తి, సింగరాయకొండలో పనిచేస్తున్న ఎస్ రమణయ్యను కంభం తహసీల్దార్‌గా నియమించారు. సీఎ్‌సపురంలో పనిచేస్తున్న ఎంవీకే సుధాకర్‌రావును పొన్నలూరు, దోర్నాలలో పనిచేస్తున్న పి.అనురాధను కేఆర్‌సీసీ ఒంగోలు ఆర్డీవో ఆఫీసు, అర్థవీడులో పనిచేస్తున్న జె.ప్రసాదరావును సింగరాయకొండ, గిద్దలూరులో పనిచేస్తున్న పద్మనాభుడును బేస్తవారపేట, కంభంలో పనిచేస్తున్న వైవీబీ కుటుంబరావును టంగుటూరు, దర్శిలో పనిచేస్తున్న బి.పద్మావతిని నాగులుప్పలపాడు తహసీల్దార్‌గా స్థానచలనం కల్పించారు.