ట్రాఫిక్ సమస్యతో నిత్యం అవస్థలు
ABN , Publish Date - Jun 16 , 2024 | 02:13 AM
పొదిలి నగర పంచాయతీగా మారి సుమారుగా నాలుగు సంవత్సరాలు దాటింది.
పొదిలి, జూన్ 15 : పొదిలి నగర పంచాయతీగా మారి సుమారుగా నాలుగు సంవత్సరాలు దాటింది. అయినా రోడ్లు వెడల్పు చేయకపోవడంతో ప్రజలు నిత్యం ట్రాఫిక్ చిక్కులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు సంవత్సరాలుగా రోజురోజుకు వాహనాల రద్ధీ పెరిగిపోయి ట్రాఫిక్ కష్టాలు తీవ్రమవుతున్నాయి.
ఒంగోలు - నంద్యాల రహదారి విస్తరణకు నోచుకోక పోవడంతో ప్రజలకు, వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. పొదిలి నుంచి బేస్తవారిపేట, గిద్దలూరు వరకు రెండు వరుసల రహదారి ఏర్పాటు చేసేందుకు గతంలో రెండుసార్లు సర్వేలు నిర్వహించారు. ఒంగోలు నుంచి కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం తదితర పట్టణాలకు వెళ్లాలంటే పొదిలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రధానరహదారు లకు ఇరువైపుల ఆక్రమణలు పెరిగాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతు న్నాయి. పట్టణంలో అన్నీ ఇరుకు రహదారులే దర్శన మిస్తున్నాయి అయినా సంబందిత అధికారులకు మాత్రం పట్టించుకోవడం లేదు. పెరుగు తున్న ట్రాఫిక్ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకోవడంలో విఫలమౌతున్నారు.
పొదిలిలో సుమారు 55 వేలకుపైగా ప్రజలు ఉన్నా, దానికి తగినట్లు రహదారి విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు లేవు. దీంతో వాహ నాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని చిన్నబస్టాండ్, పెద్దబస్టాండ్, విశ్వనాథపురం, జూనియర్ కళాశాల రోడ్డు, తహశీల్దార్, రిజిస్ర్టార్ కార్యాలయం, మాయాబజార్ తదితర వీధుల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమోతోంది. వ్యాపారులు దుకాణాల ముందు ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరి స్తున్నారు. డ్రైనేజీలను ఆక్రమించడం, వీధులపైకి కూడా దుకాణాలు తీసుకురావడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని పలువురు విమర్శిస్తు న్నారు. వర్షంపడితే ప్రధాన రహదారులు చిన్నపాటి కుంటను తలపిస్తు న్నాయి. దీంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు పక్కకు తప్పుకొనే వీలులేకుండా ఉంది. అయితే సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూనే ఉంటున్నారు. ఇది ఏమిటి అని ప్రశ్నించరు. కాటూరి వారిపాలెం గ్రామం నుంచి మార్కాపురం అడ్డరోడ్డు వరకు జాతీయ రహదారికి ఇరువైపుల ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డును విస్తరించక పోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా పొదిలి ప్రాంతంలో ఎక్కడా కూడా రహదారులపై ప్రమాద సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుం టున్నాయని పలువురు తెలియజేస్తున్నారు. రహదారులకు ఇరువైపుల ఏత్తుగా ఏర్పాటు చేసిన మట్టిని, బంకులను తొలగించి ట్రాఫిక్ సమస్యను తీర్చాలని ప్రజలు, వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.