Share News

గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకు వస్తాం

ABN , Publish Date - May 31 , 2024 | 11:22 PM

గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేలా కృషి చేస్తున్నామని ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంఽథాలయ సంస్థ సెక్రటరీ కాసు ఆదిలక్ష్మి తెలిపారు. బల్లికురవ వచ్చిన అమె గ్రంథాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం అమె విలేకర్లతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 70 గ్రంథాలయాలు ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నాయని, వాటిల్లో 37 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 11 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు.

గ్రంథాలయాలకు   పూర్వవైభవం తీసుకు వస్తాం
బల్లికురవ గ్రంథాలయంలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి

బల్లికురవ. మే 31 : గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేలా కృషి చేస్తున్నామని ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంఽథాలయ సంస్థ సెక్రటరీ కాసు ఆదిలక్ష్మి తెలిపారు. బల్లికురవ వచ్చిన అమె గ్రంథాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం అమె విలేకర్లతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 70 గ్రంథాలయాలు ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నాయని, వాటిల్లో 37 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 11 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. త్వరలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్‌కు నివేదిక అందించామన్నారు. ఈ తనిఖీలో రమేష్‌, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:22 PM