Share News

వైభవంగా తిరుమలనాథస్వామి రథోత్సవం

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:11 AM

మండలంలోని రాజంపల్లిలో గొడ్రాలి కొండపై వెలసిన శ్రీ తిరుమలనాధస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా తిరుమలనాథస్వామి రథోత్సవం

పెద్దారవీడు(మార్కాపురం), జూన్‌ 26: మండలంలోని రాజంపల్లిలో గొడ్రాలి కొండపై వెలసిన శ్రీ తిరుమలనాధస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారి మూల విరాట్‌ను ఆలయ ప్రధానార్చకులు భవానీ ప్రసాద్‌ ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు అభిషేకం, మహాన్యాసం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను రథంపై ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహిం చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులను భారీ ఎత్తున అన్న దాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళల కోళాటాలు, చిన్నారుల నృత్యాలను ఆకర్షించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా సీఐ రాములూనాయక్‌, ఎస్సై వెంకట సైదులు ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.

హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన

బ్రహ్మోత్సవాల సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. మూడవ రోజు బుధవారం సీనియర్‌ విభాగంలో పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం కాపురావూరుకు చెందిన తోటా శ్రీనివాసరావుకు చెందిన ఎండ్ల జత రూ. 70వేల ప్రధమ బహుమతిని, నంద్యాల జిల్లా ఈవెళ మండలం గుంపరుమనుదిన్నెకు చెందిన కుందు రు రాంభూపాల్‌రెడ్డికి చెందిన ఎడ్ల జత రూ.50వేల ద్వితీయ బహుమతిని, గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం కాపురావూరు చెందిన తోటా శ్రీనివాసరావుకు చెందిన ఎడ్ల జత రూ.30వేల తృతీయ బహుమతిని, ప్రకాశం జల్లా పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన కటికల జస్వంత్‌కు చెందిన ఎడ్ల జత రూ.20వేల చతుర్ధ బహుమతిని, రాచర్ల మండలం జె.పి.చెరువుకు చెందిన బొర్ర రవితేజ ఎడ్ల జత రూ.10 ఐదవ బహుమతిని గెలుచుకొంది. కమిటీ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.

Updated Date - Jun 27 , 2024 | 12:11 AM