జిల్లాకు ముగ్గురు ఎస్‌డీసీలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:18 AM
జిల్లాకు ముగ్గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు ముగ్గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్ (ఎల్‌ఏ) వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కె.శ్రీధర్‌రెడ్డి, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎస్‌డీసీగా సిహెచ్.విజయజ్యోతి కుమారి, కేఆర్‌సీసీ ఎస్‌డీసీగా కె.చిన్నయ్యను నియమించారు.