Share News

కృషి, పట్టుదలతో సాధించలేనిదేదీ లేదు

ABN , Publish Date - Jan 28 , 2024 | 10:26 PM

కృషి పట్టుదల ఉంటే సాధించలేనిదేది లేదని మాజీ ఎ మ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసిహారెడ్డి అన్నారు. ఖోఖో క్రీడల్లో రాణించి ఇ టీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతులను ఆదివారం ఉగ్ర ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడతూ ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక కోణంలో ప్రతిభ దాగి ఉంటుందన్నా రు. ఆయా ప్రతిభను గుర్తించి వారిని ఆ మార్గంలో రాణించేలా ప్రోత్సహాన్ని ఇ వ్వడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు. ఆ కోవలో ఎంఎన్‌ఎం, ఎంఎ్‌సఆర్‌ కళాశాల లు ఉండడం అభినందించ దగిన విషయమన్నారు.

కృషి, పట్టుదలతో సాధించలేనిదేదీ లేదు

క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని సన్మానించిన డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, జనవరి 28 : కృషి పట్టుదల ఉంటే సాధించలేనిదేది లేదని మాజీ ఎ మ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసిహారెడ్డి అన్నారు. ఖోఖో క్రీడల్లో రాణించి ఇ టీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతులను ఆదివారం ఉగ్ర ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడతూ ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక కోణంలో ప్రతిభ దాగి ఉంటుందన్నా రు. ఆయా ప్రతిభను గుర్తించి వారిని ఆ మార్గంలో రాణించేలా ప్రోత్సహాన్ని ఇ వ్వడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు. ఆ కోవలో ఎంఎన్‌ఎం, ఎంఎ్‌సఆర్‌ కళాశాల లు ఉండడం అభినందించ దగిన విషయమన్నారు. అందుకే క్రీడారంగం ద్వారా ప్ర భుత్వ ఉద్యోగాలను రాశి, సావిత్రమ్మ సాధించారన్నారు. మండలంలోని పాతపాడు హైస్కూల్‌లో విద్యను నభ్యసిస్తూ 9వ తరగతి నుంచి ఖోఖో క్రీడలపై ఆశక్తితో పోటీలలో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో పాటు డీఎస్సీలో ఉద్యోగం సా ధించి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ)గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం గ ర్వకారణమని ఉగ్ర అభినందించారు. 2018 సెప్టెంబరులో ఇంగ్లాండ్‌లో జరిగిన అం తర్జాతీయ ఖోఖో పోటీలలో ఇండియా తరుపున ఆడి బంగారు పతకం సాధించారని పీడీ విశ్వనాథ్‌రెడ్డి ఉగ్రకు వివరించారు. అప్పట్లో ఇంగ్లాండ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు రాశికి ఖర్చుల నిమిత్తం రూ.లక్షను ఉగ్ర సాయం చేసిన విషయాన్ని పీడీ గుర్తు చేశారు. కనిగిరి ప్రాంత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నదే తన తపన అని ఉగ్ర అన్నారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన యువతులను డాక్టర్‌ ఉగ్ర ఘనంగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో ఎంఎన్‌ఎం కరస్పాండెంట్‌ ఏలూరి సుబ్బారావు, ఏపీ ఖోఖో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం సీతారామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ కాశీవిశ్వనాథరెడ్డి, పీఈటీ వై.శ్రీనివాసరెడ్డి, జాతీయ స్థాయి క్రీడాకారిణిలు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 10:26 PM