Share News

వచ్చేదే లేదు!

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:12 PM

ముఖ్య నాయకులందరూ హాజరయ్యే విధంగా రమారమి నెలరోజుల కసరత్తు అనంతరం శుక్రవారం కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల వైసీపీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ రెండు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జిలుగా మంత్రులు సురేష్‌, మేరుగ నాగార్జునలను నియమించిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గాల్లోని కొందరు నాయకులు వారి నియామకాన్ని వ్యతిరేకించటం, ముఖ్యంగా ఎంపీ మాగుంట, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలు సమావేశానికి హాజరుకాబోమని చెప్పటంతో వారి రాక కోసం అధికారికంగా కార్యకర్తల సమావేశాలు ఇంతవరకు జరపలేదు. అయితే తాజాగా శుక్రవారం ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మాగుంట, బాలినేనిలను సీఎం దూరంగా పెట్టారన్న వార్తల నేపథ్యంలో వారు రాబోరని తెలుస్తోంది.

వచ్చేదే లేదు!

నేడు కొండపి- ఎస్‌ఎన్‌పాడు సమావేశాలు

రాలేమని చెప్పిన బాలినేని, మాగుంట

వారి అనుచరులు గైర్హాజరయ్యే అవకాశం

నెలరోజుల కసరత్తు తర్వాత నిర్వహణ

ఆసక్తికరంగా మారిన తాజా వ్యవహారం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ముఖ్య నాయకులందరూ హాజరయ్యే విధంగా రమారమి నెలరోజుల కసరత్తు అనంతరం శుక్రవారం కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల వైసీపీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ రెండు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జిలుగా మంత్రులు సురేష్‌, మేరుగ నాగార్జునలను నియమించిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గాల్లోని కొందరు నాయకులు వారి నియామకాన్ని వ్యతిరేకించటం, ముఖ్యంగా ఎంపీ మాగుంట, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలు సమావేశానికి హాజరుకాబోమని చెప్పటంతో వారి రాక కోసం అధికారికంగా కార్యకర్తల సమావేశాలు ఇంతవరకు జరపలేదు. అయితే తాజాగా శుక్రవారం ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మాగుంట, బాలినేనిలను సీఎం దూరంగా పెట్టారన్న వార్తల నేపథ్యంలో వారు రాబోరని తెలుస్తోంది.

ఎమ్మెల్యే సుధాకర్‌కు ఆహ్వానమే లేదు

ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు ఆహ్వానమే లేనట్లు తెలుస్తోంది. ఆ సమావేశంకు జిల్లా పార్టీ పేరుతో నియోజకవర్గంలోని నాయకులకు పంపిన సమాచారంలో చిన్న పెద్దా నాయకుల పేర్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పేరు లేకపోవటం విశేషం. దీంతో తనకు ఎక్కడా టికెట్‌ కేటాయించని నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్న సుధాకర్‌బాబును అధిష్ఠానం కూడా పట్టించుకోలేదనే విషయం వెల్లడవుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

కీలక నాయకులు అనుమానమే

ఇంకోవైపు ఈ రెండు సమావేశాలకు ఆయా నియోజకవర్గాల్లోని పలువురు ముఖ్య నాయకులు కూడా గెర్హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది ఉదయం 10.30కు కొండపిలో ఆ నియోజకవర్గ సమావేశంను, సాయంత్రం 3గంటలకు ఒంగోలులోని విష్ణుప్రియ కల్యాణ మండపంలో ఎస్‌ఎన్‌పాడు సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కొత్త ఇన్‌చార్జిలు అయిన మంత్రులు సురేష్‌, నాగార్జునల పరిచయ కార్యక్రమం పేరుతో ఏర్పాటు చేసిన ఈ సమావేశాలకు ప్రతి మండలం నుంచి 50 మంది వరకు ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. మంత్రి సురేష్‌ అయితే నియోజకవర్గంలోని పలువురు నాయకులకు తన కార్యాలయం నుంచి కూడా సమావేశానికి రావాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐప్యాక్‌ ప్రతినిధులు ముఖ్య నాయకులందరికీ ఫోన్‌ చేసి సమావేశానికి హాజరుకావాలని కోరుతున్నారు. కొండపి సమావేశానికి ప్రభుత్వ సలహాదారుడు జూపూడి ప్రభాకర్‌రావు, డాక్టర్‌ వెంకయ్య తదితరుల కూడా హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. వేమూరు ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన అశోక్‌బాబు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంక కొండపి నియోజకవర్గంలో అటు మాగుంటకు, ఇటు బాలినేనికి బలమైన అనుచరగణం ఉంది. వారిలో ఎంతమంది హాజరవుతారు, ఎవరు డుమ్మా కొడతారో చూడాల్సి ఉంది. ఎస్‌ఎన్‌పాడుకు సంబంధించి ఇటీవల ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అనుచరులు, వ్యతిరేకులు రెండు గ్రూపుల్లోనూ తటస్థంగా ఉన్న బాలినేని అనుచరులు సమావేశమై తమ నేత వచ్చేవరకు తాము నాగార్జునకు మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే ప్రకటించారు. ఈనేపఽథ్యంలో బాలినేని సమావేశానికి రాకపోవటం, ఎమ్మెల్యేకు అసలు ఆహ్వానమే లేకపోవటంతో నియోజకవర్గంలోని నాయకులు ఏ స్థాయిలో హాజరవుతారనే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత నెలకొంది. ఇంకోవైపు మార్కాపురం టికెట్‌ ఆశిస్తున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డికి పార్టీ అవకాశం ఇస్తుందా లేదా అనే అంశం అధికారికంగా ఖరారు కాలేదు. దీంతో జంకె వెంకటరెడ్డి సమావేశానికి హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Updated Date - Jan 11 , 2024 | 11:12 PM