Share News

శింగరకొండ దేవస్థానం పాలకమండలి నియామకం లేనట్టేనా!

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:37 PM

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం పాలకమండలి నియామకం ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే అవకాశాలు లేనట్లేనని పలువురు ఆశావహులు నిరుత్సాహం చెందుతున్నారు. గతంలో సుమారు పుష్కరకాలం పాటు పాలకమండలి నియామకం జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు రెండేళ్ళకు పాలకమండలి నియామకం జరిగింది. చైర్మన్‌గా కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి నెలతో పాలక మండలి గడువు ముగిసింది.

శింగరకొండ దేవస్థానం పాలకమండలి నియామకం లేనట్టేనా!
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం

చివరి నిమిషంలో బ్రేక్‌ పడిన ఉత్తర్వులు

వైసీపీలో అంతర్యుద్ధంతో

ఆశావహుల్లో నిరుత్సాహం

పది నెలలుగా ఎదురుచూపులే!

అద్దంకి, ఫిబ్రవరి 1: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం పాలకమండలి నియామకం ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే అవకాశాలు లేనట్లేనని పలువురు ఆశావహులు నిరుత్సాహం చెందుతున్నారు. గతంలో సుమారు పుష్కరకాలం పాటు పాలకమండలి నియామకం జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు రెండేళ్ళకు పాలకమండలి నియామకం జరిగింది. చైర్మన్‌గా కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి నెలతో పాలక మండలి గడువు ముగిసింది. అప్పటి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణచైతన్యతో కోట శ్రీనివాసరావుకు సత్సం బంధాలు లేకపోవటంతో, అనంతరం కొత్త వ్యక్తులను నియమించే విధంగా ఏర్పాట్లు జరిగాయి.

కొత్త పాలకమండలి నియామకానికి సంబంధించి అక్టోబర్‌లో ఉత్తర్వు లు వచ్చినా చివరి నిమిషంలో బ్రేక్‌ పడింది. ఈలోపు వైసీపీ ఇన్‌చార్జ్‌గా పాణెం హనిమిరెడ్డి రావటంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. పాత ఉత్తర ్వులు బుట్టదాఖలు అయ్యాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవ కాశం ఉండటంతో ఈ ప్రభుత్వంలో కొత్త పాలక మండలి నియామకం జరగటం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో చైర్మన్‌ పోస్టు ఆశించిన పలువురు ఆర్యవైశ్యులు నిరుత్సాహానికి గురయ్యారు. వైసీపీ అఽధికారంలో ఉన్న కాలంలో రెండు పాలకమండళ్ళు పూర్తికాలం పనిచేసే అవకాశం ఉన్నప్పటికి ఒక పాలకమండలితో సరిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతల మధ్య అంతర్యుద్ధం వల్లనే ప్రస న్నాంజనేయస్వామి దేవస్థానం పాలకమండలి నియామకం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలలో ఆర్యవైశ్య ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అద్దంకి పట్టణంలోని ఆర్యవైశ్యులలో వైసీపీ ఓటింగ్‌ శాతం ఇప్పటికే అంతంతమాత్రంగా ఉండగా చైర్మన్‌ నియామకం జరగకపోవటం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమ వుతుంది.

Updated Date - Feb 01 , 2024 | 10:37 PM