టీడీపీలోనే బీసీలకు సముచిత స్థానం
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:03 PM
టీడీపీలోనే బీసీలకు సముచిత స్థానం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో బుధవారం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో 75వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి మళ్లించారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సబ్‌ప్లాన్ నిధులను వారికే ఉపయోగించేలా ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పారు.

బీసీ డిక్లరేషన్‌తో హర్షం వ్యక్తం చేసిన నేతలు
చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
తెలుగుదేశంలో చేరిన 37 యాదవ సామాజిక వర్గ కుటుంబాలు
కనిగిరి, మార్చి 6 : టీడీపీలోనే బీసీలకు సముచిత స్థానం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో బుధవారం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో 75వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి మళ్లించారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సబ్‌ప్లాన్ నిధులను వారికే ఉపయోగించేలా ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వైఎస్ జగన్ 34 నుంచి 24 శాతానికి తగ్గించారని తెలిపారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా చేస్తానని జగన్ హామీ ఇవ్వగా.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కి నేరుగా వైసీపీ నేతలే నాసిరకం మద్యం అమ్మకాలు చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు డిక్లరేషన్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు వివిధ బీసీ సంఘాల నేతలు పాలభిషేకం చేశారు. చంద్రబాబు ఫేస్ మాస్కులు ఽపట్టుకుని హర్షం వ్యక్తం చేస్తూ జయజయ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సీఎ్‌సపురం మండలంలోని చెన్నపునాయునిపల్లికి చెందిన యాదవ సామాజికవర్గానికి చెందిన 37 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అదేవిదంగా హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు గ్రామానికి చెందిన 13 దళిత కుటుంబాలు డాక్టర్ ఉగ్ర సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎ్‌సపురం, హనుమంతునిపాడు మండల పార్టీ అధ్యక్షులు బొమ్మనబోయిన వెంగయ్య, మాజీ ఎంపీపీ తోడేటి అల్లూరయ్య, సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎ్‌సటీఆర్), గాయం తిరుపతిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.