Share News

బాధిత కుటుంబం ధర్నా

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:51 PM

కేశినేనిపల్లి వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనం ఆటోను ఢీకొని మృతి చెందిన నార్నెపాటి ఇజ్రాయేల్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాజుపాలెంలో అతని బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు, మండల వైసీపీ నాయకులు చేసిన చర్యలు ఫలించక పోవడంతో బంధువులతో కలిసి ఎస్సీ కాలనీకి చెం దిన యువకులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి మంత్రి సురే్‌షకి వ్యతిరేకం గా నినాదాలు చేశారు.

బాధిత కుటుంబం ధర్నా
రోడ్డుపై ధర్నా చేస్తున్న బాధిత బంధువులు, గ్రామస్థులు

మంత్రి సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు

రూ.50లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌

త్రిపురాంతకం, మార్చి 6 : కేశినేనిపల్లి వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనం ఆటోను ఢీకొని మృతి చెందిన నార్నెపాటి ఇజ్రాయేల్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాజుపాలెంలో అతని బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు, మండల వైసీపీ నాయకులు చేసిన చర్యలు ఫలించక పోవడంతో బంధువులతో కలిసి ఎస్సీ కాలనీకి చెం దిన యువకులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి మంత్రి సురే్‌షకి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. మంత్రి సురేష్‌ డౌన్‌ డౌన్‌, న్యాయం చేయాలని డి మాండ్‌ చేశారు. మంత్రి సురేష్‌ రావాలని, రూ.50 లక్షల పరిహారం ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మానికొండ శ్రీనివాసరెడ్డి, కందుల శ్రీనివాసరెడ్డితోపాటు వైసీపీ నాయకులు అలవాల శంకరరెడ్డి కూడా బాధితులకు అండగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. సీఐ ఎస్‌.సుబ్బారావు, త్రిపురాంతకం, కురిచేడు ఎస్సైలు సాంబశివయ్య, సుమన్‌ సిబ్బంది తో కలిసి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటల తర్వాత అక్కడకు చేరుకున్న నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ మృతదేహానికి నివాళులర్పించి ధర్నా చేస్తున్న వారితో మాట్లాడే ప్ర యత్నం చేశారు. దీంతో మీరు ధర్నాలో కూర్చోవాలని పట్టుబట్టడంతో చేసేది లేక చంద్రశేఖర్‌ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మంత్రి సురేష్‌ తరపున రూ.50 వేలు అందించారు. తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలను బాధిత కుటుంబానికి ఇస్తానని చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు. ధర్నా విరమించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇజ్రాయేల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు డిమాండ్‌

ఎర్రగొండపాలెం, మార్చి 6 : మంత్రి సురేష్‌ కాన్వాయ్‌ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని మృతి చెందిన నార్నెపాటి ఇజ్రాయేల్‌ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు డిమాండ్‌ చేశారు. బుధవారం ఎర్రగొండపాలెం వైద్యశాలలో ఇజ్రాయేల్‌ మృతదేహాన్ని ఎరిక్షన్‌బాబు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వాళ్ల నాన్నమ్మ, సోదరిని పరామ్శంచారు. మం త్రి కాన్వాయ్‌ వాహనం ఢీకొట్టి మృతిచెందినా సురేష్‌ పరామర్శించకపోవడం చూ స్తుంటే దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ఘటనపై వెం టనే కేసు నమోదు చేయాలని త్రిపురాంతకం ఎస్‌ఐని కోరారు.

Updated Date - Mar 06 , 2024 | 11:52 PM