Share News

సాకారంకాని పేదల సొంతింటి కల

ABN , Publish Date - Jul 15 , 2024 | 09:48 PM

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు పునాదులు దాట లేదు. ఎక్కడా పూర్తయిన గృహాలు కనిపించకపోగా, అసంపూర్తిగా నిర్మా ణాలు మాత్రం జగనన్న లేఅవుట్లలో కన్పిస్తున్నాయి. మండలంలో 8 గ్రా మాల్లో జగనన్న లేఔట్లలో ఊర్లే నిర్మిస్తామని అప్పటి పాలకులు ఆర్భాటం గా ప్రకటించారు. లక్ష్య సాధనలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారు.

సాకారంకాని పేదల సొంతింటి కల
తూర్పు కోడిగుడ్లపాడులో పునాది దశలో ఉన్న గృహాలు

- గత ప్రభుత్వంలో పునాదులు దాటని వైనం

- ఆర్భాటంగా లేఅవుట్లు

- లక్ష్యసాధనలో పూర్తిగా వైఫల్యం

- యూనిట్‌ ధర పెంచాలని

కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్న లబ్ధిదారులు

పామూరు, జూలై 15: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు పునాదులు దాట లేదు. ఎక్కడా పూర్తయిన గృహాలు కనిపించకపోగా, అసంపూర్తిగా నిర్మా ణాలు మాత్రం జగనన్న లేఅవుట్లలో కన్పిస్తున్నాయి. మండలంలో 8 గ్రా మాల్లో జగనన్న లేఔట్లలో ఊర్లే నిర్మిస్తామని అప్పటి పాలకులు ఆర్భాటం గా ప్రకటించారు. లక్ష్య సాధనలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారు. నియోజకవర్గంలోనే అతి పెద్ద లేఅవుట్‌ అయిన గుమ్మలంపాడులో 536 ప్లాట్లు వేసి, 236 మందికి గృహాలు మంజూరు చేశారు. కేవలం ఒకే ఒక ఇల్లు మాత్రమే నిర్మించడం విశేషం. ఇంటి పట్టా పొందిన ప్రతి లబ్ధిదారు నికి నిర్మాణం కోసం ప్రభుత్వ ప్రకటించిన రూ.1.80 వేలల్లోనే రూ.35 వేలు విలువ చేసే 486 కేజీల ఇనుము, రూ.24 వేలు ఖరీదుచేసే 90 బస్తాల సిమెంటు, రూ.7,500 విలువ కలిగిన 20 టన్నుల ఇసుక ను ప్రభుత్వం స రఫరా చేసింది. అయితే, పెరిగిన ధరల ప్రభావంతో గృహాలు నిర్మించు కోవడానికి అబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్‌ ధరను పెంచాలని, సెంటున్నర బదులు కనీసం రెండున్నర సెంట్ల స్థలం కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పామూరు మండలంలో వేసిన 8 లేఅవుట్లలో సుమారుగా 1500 గృహా లలో కనీసం 20శాతం కూడా పూర్తి కాలేదు. చాలాచోట్ల నిర్మాణ దశలోనే ఉన్నాయి. తూర్పు కోడిగుడ్లపాడులో సర్వే నెంబర్‌ 110లో 180 మందికి ఇంటి పట్టాలు మంజూరుచేశారు. మొదటి విడత లో 27 గృహాలు మం జూరుకాగా, కేవలం మూడు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి పునాదులతోనే నిలిచిపోయాయి. త్వరగా పనులు చేపట్టేలా అధికారులు చ ర్యలు తీసుకున్నా లబ్ధిదారులు ముందుకురాలేదు. అందుకు ప్రధాన కార ణం గ్రామాలకు దూరంగా ఇంటి పట్టాలు మంజూరుచేశారు. దీనికితోడు గృహానిర్మాణ సామగ్రి, బేల్ధారి మేస్ర్తీల ఖర్చులు, ధరలు పెరగడంతోపాటు కనీస సదుపాయాలులేవు. మంజూరైన సెంటున్నర స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ గృహా నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకొన్న లబ్ధిదారులకు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చివరి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే. ప్ర స్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆ బిల్లులు మంజూరుచేయాలని లబ్ధి దారులు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన లేఅవుట్లలో గృహాలు లేకున్నా లెక్కకు మించి విద్యుత్‌ స్తంభాలు మాత్రం ఉన్నాయి. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని యూనిట్‌ ధరను పెంచి నిర్మా ణాలను అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని నూతన ప్రభుత్వా న్ని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 09:48 PM