Share News

వైసీపీ నేతల ఒత్తిడితో నిలిచిన స్కిల్‌ టెస్ట్‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:32 PM

వైసీపీ నేతల ఒత్తిడితో జాలర్లకు నిర్వహిస్తున్న స్కిల్‌టె్‌స్టను నిలిపివేశారు. మండలంలోని మోపాడు రిజర్వాయర్‌ నుచ్చుపొద జాలర్ల సహకార సంఘంలో సభ్యులుగా చేరే జాలర్లకు వృత్తి నైపుణ్యతపై పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జాలర్లకు స్కిల్‌ టెస్ట్‌ను నిర్వహించగా, మూడు రోజుల పాటి జరిగే ఈ కార్యక్రమంలో భా గంగా మంగళవారం రెండోరోజు మత్స్యశాఖ అధికారులు డుమ్మా కొట్టారు.

వైసీపీ నేతల ఒత్తిడితో నిలిచిన స్కిల్‌ టెస్ట్‌
నిరసన తెలుపుతున్న జాలర్లు

మత్స్యశాఖ అధికారుల తీరుపై జాలర్ల నిరసన

పామూరు, మార్చి 12 : వైసీపీ నేతల ఒత్తిడితో జాలర్లకు నిర్వహిస్తున్న స్కిల్‌టె్‌స్టను నిలిపివేశారు. మండలంలోని మోపాడు రిజర్వాయర్‌ నుచ్చుపొద జాలర్ల సహకార సంఘంలో సభ్యులుగా చేరే జాలర్లకు వృత్తి నైపుణ్యతపై పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జాలర్లకు స్కిల్‌ టెస్ట్‌ను నిర్వహించగా, మూడు రోజుల పాటి జరిగే ఈ కార్యక్రమంలో భా గంగా మంగళవారం రెండోరోజు మత్స్యశాఖ అధికారులు డుమ్మా కొట్టారు. అధికారుల కో సం ఎదురు చూసిన జాలర్లు ఫోన్‌లో ఏడీ ఉ షారాణిని సంప్రదించారు. మత్స్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కిల్‌ టెస్ట్‌ను నిలిపివేసినట్లు తెలిపారని మత్స్యకారుల బెస్త సం క్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓగూరి ఏ డుకొండలు తెలిపారు. అధికార పార్టీ నాయక లు ఒత్తిడి మేరకే కార్యక్రమాన్ని రద్దు చేశారని మత్స్యకారులు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మోపాడు సొసైటీ పరిధిలో ప్రస్తు తం కేవలం 33 మంది మాత్రమే ఉన్నారు. కొ త్తగా స్కిల్‌టెస్ట్‌ జరిపితే మరో 300 మందికి సభ్యత్వాలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో మన మాట వినే వారే ఉండరన్న కారణంతోనే రాజకీయ నాయకులు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి స్కిల్‌ టెస్ట్‌ను నిలిపివేశారని జాలర్ల ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్‌ ఎస్సీ, ఎస్టీ పొట్లూరి లక్ష్మయ్య, నరసింహారావు, చింతకుంట రమేష్‌, సంఘ సభ్యులు చేవూరు కొండయ్య, సవరం రాజేష్‌, లక్కనబోయిన ప్రసాద్‌, జాలర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 10:32 PM