ఇసుక ఇక్కట్లకు తెర
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:53 PM
ఇసుక ఇక్కట్లకు తెరపడింది. ప్రజలకు ఇసుకను ఉచితంగా అందజేయాలని సంకల్పించిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలలోపు దాన్ని అమల్లోకి తెచ్చింది. జరుగుమల్లి మండలం చతుకుపాడులో ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియను రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి ప్రారంభించారు. ఒంగోలు ఏఎంసీ ఆవరణలోని స్టాక్ పాయింట్ వద్ద ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లు ప్రారంభించారు. దీంతో నిర్మాణ రంగానికి భారీ ఊరట లభించింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేది. జిల్లాలో ఏప్రాంతంలోనైనా నాలుగు నుంచి 5 టన్నుల పరిమాణం ఉండే ట్రాక్టర్ ట్రక్కు ఇసుక రూ.వెయ్యికి దొరికేది.

ఉచిత విధానం అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం
జిల్లాలో మూడు స్టాక్ పాయింట్ల నుంచి తక్షణం సరఫరా
చతుకుపాడులో ప్రారంభించిన మంత్రి స్వామి
నిర్మాణ రంగానికి భారీ ఊరట
ఒంగోలు, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ఇసుక ఇక్కట్లకు తెరపడింది. ప్రజలకు ఇసుకను ఉచితంగా అందజేయాలని సంకల్పించిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలలోపు దాన్ని అమల్లోకి తెచ్చింది. జరుగుమల్లి మండలం చతుకుపాడులో ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియను రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి ప్రారంభించారు. ఒంగోలు ఏఎంసీ ఆవరణలోని స్టాక్ పాయింట్ వద్ద ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లు ప్రారంభించారు. దీంతో నిర్మాణ రంగానికి భారీ ఊరట లభించింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేది. జిల్లాలో ఏప్రాంతంలోనైనా నాలుగు నుంచి 5 టన్నుల పరిమాణం ఉండే ట్రాక్టర్ ట్రక్కు ఇసుక రూ.వెయ్యికి దొరికేది.
హామీని నెలలోపే అమలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియను ప్రారంభింది. జిల్లాలో మూడు స్టాక్ పాయింట్లలో 42,834 టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. అందులో జరుగుమల్లి మండలం చతుకుపాడు-1 పాయింట్లో 16,044 టన్నులు, చతుకుపాడు-2 పాయింట్లో 24,972 టన్నులు, ఒంగోలులోని ఏఎంిసీ ఆవరణలో 1,818 టన్నులు ఉంది. దానిని అందించే ప్రక్రియను ప్రారంభించారు. స్టాక్ పాయింట్లకు గతంలో నెల్లూరు నుంచి ఇసుక తెచ్చి నిల్వ ఉంచగా అక్కడ లోడింగ్, రవాణా, పన్నులు కలిపి టన్ను ధర రూ.247 నిర్ణయించారు. ఆ మేరకు చెల్లించిన వారికి ఒక్కొక్కరికి రోజుకు 20 టన్నులు అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం ట్రాక్టర్ ట్రక్కు ఇసుక (ఐదు టన్నులు) ప్రస్తుతం రూ.1235కే లభించనుంది. వైసీపీ ప్రభుత్వంలోని ధరలతో పోల్చితే ప్రస్తుత ధర కేవలం నాలుగో వంతే.
మున్ముందు మరింతగా..
ప్రస్తుతం మూడు నిల్వ కేంద్రాల నుంచి ఉచిత ఇసుక సరఫరాను ప్రారంభించగా భవిష్యత్‌లో మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. అందుబాటులో ఉంటే సమీప గ్రామాల ప్రజలు తమ అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడితే ట్రాక్టర్‌కు రూ.10 వేలు, లారీకి రూ.25 వేలు జరిమానా విధించనున్నారు. ఇసుక సరఫరా ప్రక్రియలో సెబ్, రెవెన్యూ, గనులు, ఇతర శాఖల అధికారుల నిఘా ఉండనుంది.
వైసీపీ పాలనలో బంగారంగా మారిన ఇసుక
వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేసింది. ప్రాంతాల వారీ తమకు అనుకూలమైన సంస్థలకు టెండర్లను కట్టబెట్టింది. టన్ను రూ.800పైగా ధరలు పెట్టడంతో ట్రాక్టర్ ఇసుక ధర రూ.4వేల నుంచి రూ.5 వేలు పలికింది. వాగులు, వంకలు, చిన్నపాటి నదుల పక్కన ఉన్న ప్రజలను సైతం వారి ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇసుక తీసుకెళ్లనివ్వలేదు. మరోవైపు వైసీపీకి చెందిన నేతలు అక్రమంగా అనేక ప్రాంతాల్లో ఇసుక త్వకాలు చేసి కోట్లు గడించారు. ఇలా ఒకవైపు ప్రకృతి సంపద అయిన ఇసుకను అక్రమ తవ్వకం, మరోవైపు ప్రైవేటు సంస్థల పేరుతో ధరలు పెంచి ప్రజలనెత్తిన భారం మోపి దోపీడీ చేశారు. వైసీపీ కాలంలో ఇసుక బంగారమవడంతో సాధారణ, మధ్య తరగతి వర్గాల ప్రజలు గృహాలు, ఇతర నిరర్మాణాల కోసం అధిక మొత్తాన్ని ఇసుక కోసం వెచ్చించాల్సి వచ్చింది. ఆ ప్రభావం నిర్మాణ రంగంపై పడి వేలాది భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు పనులు లేక అవస్థ పడ్డాయి. ఈ పరిస్థితిన గుర్తించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం అమలులోకి తెస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు.