Share News

సైనికుల త్యాగాలు మరువలేనివి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:06 PM

దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని పలువురు కొనియాడారు. టెరిటోరియల్‌ ఆర్మీ ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాశ్మీరు నుంచి సైకిల్‌ యాత్ర నిర్వ హిస్తున్నారు. కాశ్మీర్‌ లోని సియాచిన్‌ నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవు ల్లోని ఇందిరా పాయింట్‌ వరకు చేపడుతున్న సైకిల్‌ యాత్ర సోమవారం రాత్రి కనిగిరిలో అమరావతి గ్రౌండ్స్‌కు చేరింది. అక్కడ బస ఏర్పాటు చేశారు.

సైనికుల త్యాగాలు మరువలేనివి
ర్యాలీని ప్రారంభిస్తున్న సీఐ ఖాజావలి

కనిగిరికి చేరుకున్న సైకిల్‌ యాత్ర

విద్యార్థులతో భారీ ర్యాలీ

కనిగిరి, సెప్టెంబరు 10: దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని పలువురు కొనియాడారు. టెరిటోరియల్‌ ఆర్మీ ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాశ్మీరు నుంచి సైకిల్‌ యాత్ర నిర్వ హిస్తున్నారు. కాశ్మీర్‌ లోని సియాచిన్‌ నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవు ల్లోని ఇందిరా పాయింట్‌ వరకు చేపడుతున్న సైకిల్‌ యాత్ర సోమవారం రాత్రి కనిగిరిలో అమరావతి గ్రౌండ్స్‌కు చేరింది. అక్కడ బస ఏర్పాటు చేశారు. మంగళవారం అమరావతి గ్రౌండ్స్‌ వ ద్ద సీఐ ఖాజావలి ర్యాలీని ప్రారంబిం చారు. ఆర్మీ జవాన్లు, మేజర్లు, స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌కు చెందిన ఎన్‌సీ సీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని పట్టణంలో భారీ మువ్వెన్నల జెండాతో సైకిల్‌ యాత్ర చేపట్టారు. దేశవ్యా ప్తంగా జరిగే ఆర్మీ వసంతోత్సవాలు కనిగిరిలో జరిగిన కార్యక్రమం ప్రత్యేకతను చాటింది. కూటమి శ్రేణులు కూడా సైకిల్‌ యాత్రలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.

అమరావతి గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ హైస్కూల్‌ వద్దకు రావటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు ఎన్‌సీసీ దుస్తులు ధరించి ఆర్మీ జవాన్లు, మేజర్లుతో కలసి నగరంలో ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 400 వందల అడుగుల మువ్వె న్నల జెండాను చేతభూని విద్యార్థులు ర్యాలీలో పాల్గొనటం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా జవాన్లు మాట్లాడుతూ దేశభద్రత లక్ష్యంగా ఆర్మీ కృషి చేస్తుందని చెప్పారు. దాదాపు 5వేల 500 కిలోమీ టర్లు సైకిల్‌యాత్ర చేపట్టేందుకు లక్ష్యం కాగా, 3వేల 269 కిలో మీటర్లు పూర్తి చేసుకుని కనిగిరికి చేరుకున్నట్లు ఆర్మీ బృందం తెలిపారు.

ఈ యాత్రలో ఆర్మీ మేజర్లు, సిపాయిలు, కనిగిరి సీఐ ఖాజావలి, ఎస్‌ఐ త్యాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:06 PM