Share News

ధర బాగు..దిగుబడి దిగాలు..!

ABN , Publish Date - May 30 , 2024 | 11:08 PM

ఈ ఏడాది మామిడి తోట సాగు చేసిన రైతులు దిగాలు పడిపోయారు. ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడి తగ్గిపోవడంతో చేతికి రూ పాయి కూడా లాభం వచ్చే అవకాశం లేదని మామిడి రైతులు అంటున్నారు. కనీసం పెట్టిన పెట్టు బడి అయినా వస్తుందా రాదా అని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మామిడి కాయలకు, ఆకులకు నల్లి, పేను బంక తెగులు సోకడంతో మామిడి కాయ దిగుబడి తగ్గింది.

ధర బాగు..దిగుబడి దిగాలు..!
కోలలపూడిలో మామిడి తోట

తగ్గిన మామిడి తోట

నల్లి పేను బంక తెగులే కారణం

మార్టూరు, మే 30 : ఈ ఏడాది మామిడి తోట సాగు చేసిన రైతులు దిగాలు పడిపోయారు. ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడి తగ్గిపోవడంతో చేతికి రూ పాయి కూడా లాభం వచ్చే అవకాశం లేదని మామిడి రైతులు అంటున్నారు. కనీసం పెట్టిన పెట్టు బడి అయినా వస్తుందా రాదా అని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మామిడి కాయలకు, ఆకులకు నల్లి, పేను బంక తెగులు సోకడంతో మామిడి కాయ దిగుబడి తగ్గింది. మార్టూరు మండలంలో మార్టూరు, కోలలపూడి, బొల్లాపల్లి, తాటివారిపాలెం గ్రామాలలో మా మిడి తోట ఉంది. మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా మామిడి తోట సాగు చేస్తుండగా కోలలపూడి గ్రామంలో అత్యధికంగా 300 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. వాస్తవంగా కోలలపూడి మామిడి కాయలు రుచి ఎక్కువగా ఉంటాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు తదితర పట్టణాలకు చెందిన వ్యాపారులు కోలలపూడిలోని మామిడి కాయలను కొనుగోలు చేసి తీసుకు వెళతారు. మామిడి రసాలు, పచ్చడి కాయల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు కోలలపూడి మామిడి తోటకు వస్తుంటారు.

ధర బాగున్నా దిగుబడి లేదు

ప్రస్తుతం టన్ను మామిడి కాయలను రూ.44 వేలకు తోటల దగ్గర రైతులు నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. గత ఏడాది టన్ను రూ.20, రూ.22 వేలకు ధర పలికింది. దాంతో ఈ ఏడాది టన్ను ధర బాగా పెరగడంతో ఆశగా ఉన్న రైతులకు దిగుబడి తగ్గిపోవడంతో నిరాశపడి పోయారు. వాస్తవంగా ప్రస్తుతం ఎకరా మామిడి తోటకు టన్ను కాయలు మా త్రమే దిగుబడి వస్తున్నాయి. అది కూడా కొన్ని చోట్ల రైతులకు ఈ దిగుబడి కూడా రావడం లేదు. గతంలో ఎకరాకు మూడు టన్నులు కూడా దిగుబడి వచ్చిన సం దర్భాలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది టన్ను కూడా సక్రమంగా దిగుబడి రావడం లేదు. అదిగాక నవంబరు, డిసెంబరులో పూత,పిందెలతో ఏర్పడిన తోటలకు దిగుబడి నాణ్యతగా ఆశాజనకంగా ఉంది. కానీ జనవరి, ఫిబ్రవరిలో పిందెలు, పూతలు ద్వారా కాసిన కాయలు వంకరగా, రంగు, నునుపు దనం లేకుండా వచ్చాయిని వాటి ధర బాగా తగ్గిందని రైతులు అంటున్నారు. దీనికి తోడు ఎకరాకు నల్లి పేనుబంక నివారణ కోసం పురుగు మందులకు, వ్యవసాయ ఖర్చులకు ఎకరాకు రూ.10 వే లు దాకా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. ఇక ఎకరాకు కౌలు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించి తోటలు తీసుకున్న రైతులు పూర్తిగా నష్ట పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోలలపూడి గ్రామంలో ఎక్కు వ మంది రైతులు ఎకరో..అరెకరో పొ లం ఉన్నవారే. వారంతా ఈ ఏడాది మామిడి పంట గి ట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 30 , 2024 | 11:08 PM