Share News

కల్లు కోసమే వృద్ధురాలి దారుణహత్య

ABN , Publish Date - May 22 , 2024 | 12:21 AM

కల్లు తాగే అలవాటు. వృద్ధురాలి హత్యకు దారితీసింది. కల్లు అమ్మే వృద్ధురాలి ఇంటిలోకి దొడ్డిదారిన ప్రవేశించిన ఇరువురు కలు తాగుండగా ఆమె నిద్ర లేవడంతో హత్య చేసి చేతులకు ఉన్న రోల్డు గోల్డు గాజులు.. చెవికమ్మలు దొంగిలించి పరారయ్యారు.

 కల్లు కోసమే వృద్ధురాలి దారుణహత్య

దొంగతనంగా అర్ధరాత్రి ఇంటిలోకి ప్రవేశం

కల్లు తాగుతుండగా నిద్ర లేచిన నాగేశ్వరమ్మ మందలింపు

హత్య చేసి గాజులు, కమ్మలతో నిందితులు పరారీ

కేసును ఛేదించిన పోలీసులు

ఇరువురి అరెస్టు

రిమాండ్‌కు తరలింపు

కొత్తపట్నం(ఒంగోలునగరం) మే 21: కల్లు తాగే అలవాటు. వృద్ధురాలి హత్యకు దారితీసింది. కల్లు అమ్మే వృద్ధురాలి ఇంటిలోకి దొడ్డిదారిన ప్రవేశించిన ఇరువురు కలు తాగుండగా ఆమె నిద్ర లేవడంతో హత్య చేసి చేతులకు ఉన్న రోల్డు గోల్డు గాజులు.. చెవికమ్మలు దొంగిలించి పరారయ్యారు. ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. గత శనివారం కొత్తపట్నంరెడ్డిపాలెంలో జరిగిన వృ ద్ధురాలి హత్య కేసును పోలీసులు తక్కువ స మయంలోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరి ని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయాధికారి రిమాండ్‌ విధించారు. హ త్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

కొత్తపట్నం రెడ్డిపాలెంకు చెందిన గౌరవరపు నాంచార్లు, కోడూరి నాగరాజు బంధువులు. ఇద్దరు మద్యానికి అలవాటు పడ్డారు. చుక్కపడనిదే నిద్ర పట్టని పరిస్థితికి వారిది. రెడ్డిపాలెంలో కల్లు అమ్మే గుడపల్లి నాగేశ్వరమ్మ దగ్గర తరచూ కల్లు తాగు తుండే వారు. నాగేశ్వరమ్మ నివాసంలో ఒంటరిగానే ఉంటున్న విషయం వీరికి తెలుసు. గత శనివారం అర్ధరాత్రి ఇద్దరూ కల్లు కోసం నాగేశ్వరమ్మ ఇంటిలో కి ప్రవేశించారు. దొంగతనంగా కల్లు తాగుతుండగా నాగేశ్వరమ్మ నిద్రలేచి ఇద్దరిని పెద్దగా మందలించా రు. దీంతో ఆగ్రహానికి గురయిన ఇద్దరు ఆమె త లపై బలంగా కొట్టారు. కింద పడిపోయిన ఆమె గొంతును గట్టిగా నులిమేశారు. అంతేగాకుండా ము ఖంపై దిండుతో అదిమిపట్టారు. దీంతో నాగేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం వారు మృతిరాలి చేతులకు ఉన్న గాజులను, చెవులకు ఉ న్న బంగారు కమ్మలను లాగేసుకున్నారు. ఆమె వద్ద ఉన్న తాళాలు తీసుకుని బీరువాని తెరిచారు. బీరు వాలో ఎలాంటి నగదుగాని, ఇతర ఆభరణాలు కాని లేకపోవటంతో అలాగే వదిలేసి పోయారు. ఈ విష యం ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డారు. అర్ధరాత్రి కావటంతో ఎవరూ గుర్తించలేక పోయారు. ఉదయాన్నే నాగేశ్వరమ్మ హత్య ఉదం తం గ్రామంలో గుప్పుమంది. పోలీసులు వేగంగా స్పందించారు. ఏఎస్పీ శ్రీధర్‌రావు, డీఎస్పీ కిషోర్‌ బాబు, టూ టౌన్‌ సీఐ జగదీష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలోని చుట్టు పక్కల అందుబాటులో ఉన్న సీసీకెమెరాల ఫుటే జిలను పరిశీలించారు. డాగ్‌ స్కాడ్‌లతో పరిశీలన జరిపారు. ఎట్టకేలకు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులు నేరాన్ని పోలీసుల ఎదుట అం గీకరించినట్లు తెలిసింది. ఇద్దరిని కోర్టులో హాజ రుపర్చగా రిమాండ్‌ విధించినట్లు టూటౌన్‌ సీఐ జగదీష్‌ తెలిపారు.

Updated Date - May 22 , 2024 | 12:21 AM