మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:38 AM
ప్రభుత్వ వ సతిగృహాల్లో సమస్యలు తెలుసుకునేందుకు మం త్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీలతో అధికారులు చర్యలు చేపట్టా రు.

ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల కల్పనకు చర్యలు ప్రారంభం
ఒంగోలు(కార్పొరేషన్), జూలై4: ప్రభుత్వ వ సతిగృహాల్లో సమస్యలు తెలుసుకునేందుకు మం త్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీలతో అధికారులు చర్యలు చేపట్టా రు. బుధవారం ఒంగోలులోని ప్రభుత్వ బధిరుల పాఠశాల, సాంఘీక సంక్షేమ కళాశాల బాలికల వ సతిగృహాలను వారు తనిఖీ చేసిన విషయం విది తమే. ప్రజాప్రతినిధుల తనిఖీలలో గుర్తించిన స మస్యలు, అలాగే విద్యార్ధులు వెల్లడించిన సమ స్యలపై మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల స్పం దించారు. దీనిపై చర్యలకు సంబంధిత అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాంఘీక సంక్షేమశాఖ, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఈమే రకు స్థానిక భాగ్యనగర్‌లోని బాలికల సంక్షేమ వసతిగృహం వద్ద పిచ్చిమొక్కలు తొలగింపు, డ్రైనే జి వ్యవస్థను మెరుగుపరచడం, అదనపు గదుల నిర్మాణానికి అంచనాలు చేశారు. ఎక్స్‌కవేటర్ ఏ ర్పాటు చేసి చిల్లచెట్లు తొలగించడంతోపాటు, పారి శుధ్యం, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరిచినట్లు సాం ఘీక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్ తెలిపారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల, కలెక్టర్ అన్సారియా తనిఖీలతో బాలి కల వసతిగృహంలో సమస్యలు పరిష్కారం కావ డం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా వారికి డీడీ లక్ష్మనాయక్, వార్డెన్‌లు కె.స్వప్నలత, బి.శిరీ ష, హాస్టల్ విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.