డీఈవో ఆఫీసు తీరుపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం
ABN , Publish Date - May 25 , 2024 | 12:03 AM
స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనితీరుపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ అటెండ ర్లకు ఒకరోజు వేతనం నిలిపివేయాలని ఆదేశించారు.
ఒంగోలు(కలెక్టరేట్), మే 24: స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనితీరుపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ అటెండ ర్లకు ఒకరోజు వేతనం నిలిపివేయాలని ఆదేశించారు. శుక్రవారం జేసీ గోపాల కృష్ణ తన ఛాంబర్ నుంచి స్పందనహాలులోకి వెళ్ళేందుకు డీఈవో కార్యాలయ మీదుగా వెళ్తున్నారు. ఆ సమయంలో కార్యాలయ కారిడార్‌లో ఒక అటెండర్ జేసీ చూసి మర్యాదపూర్వకంగా లేచి నిలువగా, మిగిలిన ఇద్దరు అటెండర్లు ప ట్టించుకోకుండానే అలానే కూర్చుకున్నారు. దీంతో జేసీ అసంతృప్తి వ్యక్తం చే యడమే కాకుండా సంబంధిత అధికారి ఎక్కడని ప్రశ్నించారు. వెంటనే డీ ఈవోకు ఫోన్ చేయాలని పీఎస్‌కు సూచించారు. కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయభాస్కర్ కూడా ఆ సమయంలో కార్యాలయంలో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కార్యాలయ సూపరింటెండెంట్లను పిలిచి వారితో మాట్లాడారు. కారిడార్‌లో బల్లలను తొలగించాలని ఆదేశించారు. దీంతో వారు వెంటనే వాటిని తొలగించారు. జాయింట్ కలెక్టర్ సుమారు 20 నిమి షాల పాటు అక్కడే ఉండి డీఈవో కార్యాలయ ఉద్యోగులను హడలెత్తించారు. కాగా డీఈఈసెట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్ళి తిరిగి తన కా ర్యాలయానికి వచ్చిన డీఈవో సుభద్ర కార్యాలయ సిబ్బందితో సమావేశమై జరి గిన విషయం తెలుసుకున్నారు. తన ఉద్యోగ సర్వీసులో ఇటువంటి సంఘటన ఎదురు కాలేదని డీఈవో ఆవేదన వ్యక్తం చేశారు.