Share News

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేల్‌

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:18 PM

విజన్‌ కల్గిన నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో శనివారం ఐటీ ఉద్యోగులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లా డారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైద రాబాద్‌లో ఐటెక్‌ సిటీ ఏర్పాటు చేయటంవలనే లక్షలాది మందికి ఉద్యో గాలు లభించాయన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోయాయని విమర్శించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేల్‌
ఐటీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌, మాగుంట చందన తదితరులు

వైసీపీ అరాచకంతో తరలిపోయిన పరిశ్రమలు

విజన్‌ కల్గిన నాయకుడు చంద్రబాబు

కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, ఏఫ్రిల్‌ 13: విజన్‌ కల్గిన నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో శనివారం ఐటీ ఉద్యోగులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లా డారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైద రాబాద్‌లో ఐటెక్‌ సిటీ ఏర్పాటు చేయటంవలనే లక్షలాది మందికి ఉద్యో గాలు లభించాయన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోయాయని విమర్శించారు. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దర్శి నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేసి యువతకు ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని భరో సా ఇచ్చారు. జిల్లెళ్ళమూడి వెంకట్‌ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎన్‌ఆర్‌ఐల సహకారంతో వంద వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ లలిత్‌సాగర్‌, మాగుం ట చందన, కోళ్ల అశోక్‌, జిల్లెళ్ళమూడి వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సేవ చేయటానికే వచ్చా.. ఆశీర్వదించండి

ముండ్లమూరు, ఏప్రిల్‌ 13: ప్రజా సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని.. మీ ఆడ బిడ్డగా ఆదరించాలని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని ఈదర, భీమ వరం, బొప్పూడివారిపాలెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఇంటింటికి వెళ్ళి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మహిళలను, యువతను ప్రోత్సహించేలనే ఉద్దేశంతో చంద్రబాబు తనకు అవకాశం కల్పించారన్నారు. ముండ్లమూరు మండలంలో ఆగిపోయిన పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, భీమవరం, ఈదర, బొప్పూడివారి పాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన గొట్టిపాటి లక్ష్మికి ఆయా గ్రామాల మహిళలు పెద్దు ఎత్తున స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, వీరపనేని రంగా, భీమనేని నాసరయ్య, కుంచపు ఏడుకొండలు, మక్కె న రత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

వంద కుటుంబాలు టీడీపీలో చేరిక

దర్శి, ఏప్రిల్‌ 13: టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో వైసీపీ నుంచి భారీగా చేరుతున్నారని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలా జీ తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో దొనకొండ మండలం గంగ దేవిపల్లికి చెందిన వంద కుటుంబాలు బొరిగొర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండవాలు కప్పి కూటమి అభ్యర్థి డాక్టర్‌ లక్ష్మి, నూకసాని బాలాజీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే అన్నీ వర్గాల ప్ర జలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ అరాచక పాలనతో అన్నివర్గాల ప్రజలు విసుగుచెందారని అన్నారు. ఆ పార్టీకి చరమగీతం పాడేందుకు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆడపడుచుగా మీవద్దకు వచ్చా..

దర్శి, ఏప్రిల్‌ 13: ఆడపడుచుగా మీ వద్దకు వచ్చా.. ఆదరించి గెలిపిం చాలని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఎల్లప్పుడూ అందు బాబులో ఉంది నిస్వార్థ సేవలందిస్తానని చెప్పారు. శనివారం దర్శి పట్ట ణంలోని 10వ వార్డులో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత లంకోజనపల్లి రోడ్డులోని సాయి పథమ్‌లో సాయిబాబాకు పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి కి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌, దర్శి నగర పంచాయతీ చైర్మెన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యా దగిరి వాసు, పసుపులేటి శేషమ్మ, బీజేపీ నేత మాడపాకుల శ్రీనివాస రావు, జనసేన నేత సీహెచ్‌ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన సుబ్బారెడ్డి

ముండ్లమూరు, ఏప్రిల్‌ 13: మండలంలోని మారెళ్ళ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు మట్టా సుబ్బారెడ్డి శనివారం టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులు కూడా పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి చేరికతో తెలుగుదేశం పార్టీకి మారెళ్ళలో పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

Updated Date - Apr 13 , 2024 | 11:18 PM