Share News

వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:21 PM

హరి హరసుతుడు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ గురువారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ

పెద్దారవీడు, మార్చి 28: హరి హరసుతుడు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ గురువారం వైభవంగా నిర్వహించారు. పెద్దారవీడులోని శ్రీ భోగీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించి అయ్యప్ప ఆలయంలో గురువారం వేదోచ్ఛారణ మధ్య ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించారు. వేదపండితులు వీరవెంకట సత్యనారా యణశర్మ, భరద్వాజలు ఆలయ ప్రధానార్చకులు మేడవరం రాఘవేంద్రశర్మల ఆధ్వర్యంలో మండప దేవతా పూజలు, ప్రాతరౌపాసన, దీక్షా హోమం, గర్తన్యాస, రత్న న్యా, బీజన్యాస, ధాతున్యాసములు, జయాధి హోమాలు నిర్వహించారు. ఉదయం 9.38 నిమిషాలకు యంత్ర, విగ్రహ ప్రతిష్ఠలు, నేత్రోన్మీలనము, ప్రాణప్రతిష్ఠ పూర్ణాహు తి చేశారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగింది. మధ్యాహ్నం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

వైభవంగా పదహారు రోజుల పండగ

మార్కాపురం వన్‌టౌన్‌ : స్థానిక జవహర్‌నగర్‌లోని శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయంలో గురువారం 16 రోజుల పండుగ వైభవంగా నిర్వహించారు. ఇటీవలే స్వామికి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా 16 రోజుల పండుగ పురస్కరించుకొని అర్చకుడు శ్రీదేవీభూదేవి సమేత ఆమలక లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డా. డీవీ.కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలెం చెంచయ్య, కోశాధికారి వై.వెంకటరెడ్డి, మహిళా సేవా కమిటీ, వికాస తరంగిణి సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

హంసవాహనంపై శ్రీవారు

కొనకనమిట్ల : మండలంలోని వెలుగొండలో వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. హ్రోత్సవాలలో భాగంగా వెంకటేశ్వరస్వామి గువారం రాత్రి హంస వాహనంపై నుండి భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు శ్రీలక్ష్మీఅలవేలుమంగ సమేత వెంకటేశ్వరస్వామిని హంస వాహనంపై కొలువుదీర్చి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అనంతరం మత్రోచ్చరణలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాలతో వెలుగొండ పురవీధుల్లో ఏడుకొండలవాడ వెంకటేశ్వరా గోవిందా గోవింద అంటూ గోవింద నామస్మరణలతో ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని చైర్మన్‌ తిరుపతి రెడ్డి, ఈఓ చెన్నకేశవరెడ్డిలు పర్యవేక్షించారు.

నేటి నుంచి ఉగ్రనరసింహస్వామి తిరునాళ్ల

త్రిపురాంతకం : మండలంలోని గుట్లఉమ్మడివరంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రనరసింహస్వామి తిరునాళ్ల ఈ నెల 29, 30 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి తెలిపింది. 29న గణపతిపూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, సుదర్శన హోమం, లక్ష్మీగణపతి హోమం, వాస్తుహోమం, రుద్రహోమం, పూర్ణాహుతి, నైవేధ్యం, హారతి నిర్వహించ నున్నారు. 30న స్వామి అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, విష్ణుసహస్రనామ పారాయణం, సామూహిక కల్యాణం, మహామంగళ హారతి, ఆశీర్వచనం, తీర్ధప్రసాదములు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా భక్తులకు మధ్యాహ్నం భోజనకార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:21 PM